భువనగిరి BRS ఎమ్యెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(Pailla Shekar Reddy) నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇల్లు, ఆఫీసులో ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఒకే సమయంలో దాదాపు 70 మంది ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సోదాలు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు భువనగిరి ఎమ్మెల్యే పలు కంపెనీలలో బినామీగా ఉన్నట్లు సమాచారం. ఈ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మొత్తం 12 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పెళ్ల రాజశేఖర్ రెడ్డి ఓ కంపెనీలో డైరెక్టర్ గా ఎంపీ కొత్త ప్రభాకర్ ఉన్నారు. కొత్తపేట, గ్రీన్ హిల్స్ కార్యాలయాలతోపాటు భువనగిరిలోనూ కొనసాగుతున్న ఐటీ సోదాలు. మొత్తం 12 కంపెనీలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇళ్లలో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.