SRPT: మోతే మండలం మామిళ్లగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కార్లో ఉన్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.