రోగితో వెళ్తున్న ఓ అంబులెన్స్ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి బిహార్‌లోని చంపారన్‌కు రోగిని తరలిస్తుండగా.. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఓ పాదచారుడిని ఢీకొట్టిన అంబులెన్సు ఆ తర్వాత స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. ఐదుగురికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. అనిష్ షా(18) అనే రోగిని తమ స్వగ్రామానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.