SS: ధర్మవరం- అనంతపురం రహదారిలో చిగిచెర్ల సమీపంలోని విద్యుత్ సబస్టేషన్ వద్ద రోడ్డు మలుపు ప్రమాదకరంగా మారింది. కంపచెట్లు పెరిగి రోడ్డు కనిపించకపోవడం, సూచిక బోర్డులు, డివైడర్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికే పలువురు మృత్యువాతపడ్డారు. వాహనదారులు కంపచెట్లు తొలగించి, సూచిక బోర్డులు, డివైడర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.