JN: పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పల మండలం బోడబండ తండాలో ఆదివారం గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. తండాకు భూక్య మల్లేష్ అతని భార్య భూక్య బుజ్జి లు కలిసి గుడుంబా కాస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశారు. దాడుల్లో 4 లీటర్ల గుడుంబా, 15 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎస్ఐ సృజన్ కుమార్ తెలిపారు.