AP: ఎస్సై అని చెప్పి ఓ వివాహితను మోసం చేసిన ఘటన గుంటూరులో జరిగింది. పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలు ఉన్న మహిళ మనస్పర్థల కారణంతో తన భర్తతో విడిపోయింది. అనంతరం కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తోంది. ఈ క్రమంలో సాయితేజ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఎస్సైనని నమ్మించి 2023లో పెళ్లి చేసుకున్నాడు. తరువాత విడతలవారిగా తన నుంచి రూ. 23 లక్షలు, 8 సవర్ల బంగారం తీసుకొని పరార్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొంది.