Lokesh Padayatra : 300 కిలోమీటర్లు దాటిన లోకేష్ పాదయాత్ర..!
Lokesh Padayatra : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయం గా కొనసాగుతోంది. యువగళం పేరిట ఆయన చేపట్టిన యాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో... తొండమానుపురంర గ్రామంలో లోకేష్ ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయం గా కొనసాగుతోంది. యువగళం పేరిట ఆయన చేపట్టిన యాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో… తొండమానుపురంర గ్రామంలో లోకేష్ ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పంచాయతీ పరిధిలో 13 గ్రామాల దాహార్తి తీర్చే రక్షిత మంచి పథకాన్ని టిడిపి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఏర్పాటు చేస్తానని నారా లోకేష్ ప్రకటించారు. గ్రామం పక్క నుంచే నది ప్రవహిస్తున్నా చల్లపాలెం, వెంకటాపురం, సుబ్బనాయుడు కండ్రిగ, తొండమనాడు, చెర్లోపల్లి, అమ్మపాళ్యం, కొత్తపాలెం, మున్న సముద్రం, బొక్కసం పాలెం, సిద్ధయ్య గుంట, మర్లపాకు, రాచగున్నేరి, మద్దిలేడు గ్రామవాసులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నారా లోకేష్ తన పాదయాత్ర 300 కి.మీ. మజిలీ చిరకాలం గుర్తుండేలా తాగునీటి పథకం ఏర్పాటుచేసి, ప్రతీ ఇంటికి నీరందించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.కాగా.. ఆయన స్థానికంగా రైతులతో మాట్లాడి.. వారి సమస్యలను సైతం తెలుసుకున్నారు.