MDK: తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామంలో కొంతమందిపై పిచ్చికుక్క దాడి చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. గురువారం ఉదయం పిచ్చికుక్క అరుస్తూ గ్రామానికి చెందిన లక్ష్మయ్య, చంద్రయ్య, నాగరాజులపై దాడి చేసే కరిసినట్టు గ్రామస్తులు తెలిపారు. మరికొందరిపై దాడి చేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకొని కర్రలతో కొట్టి హతమార్చారు.