BPT: కొరిసపాడు మండలంలోని మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మన్నపాలెం గ్రామంలో రఘురామరెడ్డి 10 షవర్ల బంగారం చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈనెల 29న త్రోవగుంట వెళ్లి ఇవాళ ఉదయం 7 గంటల వచ్చి చూసేసరికి ఇంట్లో సామగ్రి చిందరవందరగా ఉంది. దీంతో మెదరమెట్ల పోలీసులకు సమాచారం ఇవ్వగా మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.