ATP: వజ్రకరూరు మండలం చాకిరేవు వద్ద బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చీరలు పూర్తిగా కాలిపోయాయి. ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు 2 వేలకు పైగా చీరలు కాలిపోయాయని, రూ.6 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.