E.G: సీతానగరం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొందరు దేవీపట్నం మండలంలోని పోచమ్మ తల్లి గుడికి వెళ్లి తిరిగి వస్తున్న టాటాఎస్ పురుషోత్తపట్నం గ్రామం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా… ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. డ్రైవర్ మద్యం తాగి డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.