12k fresh Covid cases reported in india and 42 deaths
Coronavirus:దేశంలో కరోనా (Corona) కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజు 10 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో 12,193 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరింది. అలాగే వైరస్ సోకిన 42 మంది చనిపోయారు. వైరస్‌తో చనిపోయిన మృతుల సంఖ్య 5,31,300కు చేరింది.
ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల (corona cases) సంఖ్య 4,48,81,877గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.15 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. కరోనా వైరస్ సోకి 4,42,83,021 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 1.18 శాతంగా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 220.66 వ్యాక్సిన్లు అందజేశామని కేంద్ర వైద్యారోగ్య శాఖ (health ministry) ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లాడించింది. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వారు ప్రాణాలను కోల్పోయారు. వారిలో ఎక్కువ యువత ఉన్నారు. ఆ తర్వాత వైరస్‌పై అవగాహన పెరిగి.. అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో థర్డ్, ఫోర్త్ వేవ్ అంతగా ఇంపాక్ట్ చూపించలేదు.