ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఒమ్మేవరం గ్రామానికి చెందిన ప్రతాప్ బైక్పై ఒంగోలు వెళ్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రతాప్ చనిపోయినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.