BPT: బల్లికురవ మండలంలోని వేమవరం వాగు వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామానికి చెందిన మునీర్ భాష తన కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరిపేట నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వేమవరం గ్రామం వద్ద వీరిది చక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న SK. ఖాన్సా అనే మూడు నెలల పాప అక్కడికక్కడే మరణించింది.