మేడ్చల్: యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటేల్ నగర్లో నివాసముంటున్న కమలేష్ మహారాష్ట్ర నుంచి 3 నెలల క్రితం ఇక్కడికి వచ్చి సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.