MNCL: మహిళల రక్షణ కోసం ‘షీ టీమ్స్’ పని చేస్తున్నాయని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 2 ‘షీ టీమ్’ బృందాలు పని చేస్తున్నాయన్నారు. మహిళ భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కమిషనరేట్ ‘షీ టీమ్’ నం.6303923700 కాల్ చేయాలన్నారు.