GNTR: జంగంగుంట్లపాలెం కేసీ రెడ్డి కళాశాలలో బీఫార్మసీ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్ధి మృతి చెందాడు. తెనాలికి చెందిన రంజిత్.. తాను ఉంటున్న హాస్టల్లో నీరు రాకపోవడంతో మేరికపూడి చెరువులోని మోటార్ బాగు చేయడానికి మెకానిక్‌తో కలిసి రంజిత్ దిగాడు. ఈక్రమంలో మట్టిలో కూరుకుపోయి రంజిత్ చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు.