W.G: శ్రీవైష్ణవ శ్రీకృష్ణాష్టమి కారణంగా ఇవాళ ఉదయం 6.30 గం. నుంచి సాయంత్రం 5 గం. వరకు కాళ్లకూరులో వేంచేసియున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం మూసివేస్తున్నట్టు దేవస్థానం ఈవో అరుణ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు స్వామివారి పునర్దర్శనం భక్తులకు యధాప్రకారంగా జరుగునన్నారు. రాత్రి 7 గంటలకు 12 రకాల ప్రసాదాలు ఆరగింపు, ప్రసాదవితరణ జరుగుతాయన్నారు.