VBVK Movie Review: వినరో భాగ్యము విష్ణు కథ మూవీ రివ్యూ
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫ్లాప్ చిత్రాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ ఈరోజు(ఫిబ్రవరి 18న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కశ్మీరా పరదేశి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ మూవీ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిత్రం: వినరో భాగ్యము విష్ణు కథ
బ్యానర్: GA2 పిక్చర్స్
తారాగణం: కిరణ్ అబ్బవరం, కాశ్మీర, మురళీ శర్మ, పమ్మి సాయి, రామ్, రవి ప్రకాష్, ప్రవీణ్, తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
DOP: డేనియల్ విశ్వాస్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాత: బన్నీ వాస్
రచన, దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు
విడుదల తేదీ: ఫిబ్రవరి 18, 2023
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫ్లాప్ చిత్రాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ ఈరోజు(ఫిబ్రవరి 18న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కశ్మీరా పరదేశి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ మూవీపై మరింత ఆసక్తిని పెంచాయి. మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఈ సినిమాపై అభిమానులపై ఇంకొంచెం క్రేజ్ పెంచుకున్నారని చెప్పవచ్చు. అయితే ఈ యంగ్ హీరో ఈ సినిమాతో హిట్టు కొట్టడా లేదా? అసలు మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
తిరుపతిలో ఉండే విష్ణు (కిరణ్ అబ్బవరం)కు ఇరుగుపొరుగున ఉన్న ఓ అమ్మాయి దర్శన (కాశ్మీరా పరదేశి) యూట్యూబర్ పరిచయం అవుతుంది. విష్ణు తన జీవితంలో ఒక అమ్మాయిని పరిచయం చేయడం లార్డ్ వెంకటేశ్వరుని మార్గమని భావిస్తాడు. ఆ క్రమంలో అతను నెమ్మదిగా ఆమె ప్రేమలో పడిపోతాడు. అదే క్రమంలో పరదేశీకి ఇరుగుపొరుగున ఉన్న మార్ఖండేయ శర్మ మరో ఫోన్ నంబర్ ద్వారా (మురళీ శర్మ) పరిచయమవుతాడు. ఈ ముగ్గురు కలిసి యూట్యూబ్ ఛానెల్లో రీల్స్ తోపాటు పలు రకాల ఫ్రాంక్ వీడియోలు చేస్తుంటారు. అయితే దర్శన విష్ణుని లవ్ చేస్తుంది కానీ చెప్పకుండా ఉంటుంది. ఆ క్రమంలో మంత్రి కావాలనుకున్న ఎమ్మెల్యే(కేజీఎఫ్ లక్కీ)శర్మను చంపేందుకు ప్లాన్ వేస్తాడు. ఓ వ్యక్తికి ఈ పని అప్పగిస్తాడు. కానీ అనుకోకుండా ఓ రోజు శర్మను దర్శన గన్ తో కాల్చేస్తుంది. ఇది తెలిసిన విష్ణు షాక్ అవుతాడు. అసలు శర్మకు, ఎమ్మెల్యేకు ఏంటి సంబంధం? ఎందుకు మర్డర్ చేయాలనుకున్నాడు? శర్మను దర్శన ఎందుకు కాల్చేసింది? ఈ క్రమంలో హీరో దర్శనను ఎలా కాపాడాడు? తిరుపతి నుంచి విష్ణు హైదరాబాద్ కు ఎందుకు వచ్చేశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
కిరణ్ అబ్బవరం క్యారెక్టరైజేషన్ సినిమాకు బెస్ట్ పార్ట్ అని చెప్పవచ్చు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేయాలనుకునే వ్యక్తిగా కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించాడు. కిరణ్ తన నటనకు స్కోప్నిచ్చే చక్కని పాత్రను ఈ చిత్రంలో ఎంచుకున్నాడు. భావోద్వేగాలతోపాటు కామెడీ టైమింగ్ కూడా అదిరిందని చెప్పవచ్చు. మరోవైపు శర్మగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. ఎప్పటిలాగే, సీనియర్ నటుడు తన బెస్ట్ ఇచ్చాడు. ఇక హీరోయిన్ కాశ్మీర పరదేశి కూడా తన రెండో చిత్రంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ సినిమా స్టోరీలో మహిళా పాత్రకు ప్రాధాన్యత ఉండటం పరదేశీకి ప్లస్ అని చెప్పవచ్చు. దీంతోపాటు పలువురి నటీనటులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు.
సాంకేతికత
చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కిరణ్ అబ్బవరంని బాగా ఎలివేట్ చేసింది. ప్రధానంగా గోపురం ఫైట్ సీన్ ప్రత్యేకంగా ఉంటుంది. పాటలు కూడా పర్వాలేదనిపిస్తుంది. తిరుపతి అందాలు, సమీపంలోని చారిత్రక ప్రదేశాలను డేనియల్ విశ్వాస్ తన సినిమాటోగ్రఫీ ద్వారా చక్కగా బంధించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాలనిపిస్తుంది. రచయిత-దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు విషయానికి వస్తే, అతను సినిమాతో మంచి మార్కులు కొట్టేశాడు. పొరుగు సంఖ్య కాన్సెప్ట్(నెయ్ బరింగ్ నైబర్) ద్వారా పాత్రలను లింక్ చేసే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, కొన్ని చోట్ల సీన్స్ సరిగా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ హీరో, హీరోయిన్ లవ్, ఫన్నీ సన్నివేశాలపై ఎక్కువగా ఆధారపడింది. కానీ సెకండాఫ్‌తో ప్రేక్షకులను థ్రిల్లింగ్ జోన్లోకి తీసుకెళతాడు.
మొత్తం మీద వినరో భాగ్యము విష్ణు కథలో మంచి ఫన్ తోపాటు, సస్పెన్స్ అంశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ శివరాత్రి పండుగ సీజన్లో ఈ సినిమా ఒక్కసారి చూసేయోచ్చు.