ADB: ఆనందంగా భర్త, పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్లో చోటుచేసుకుంది. ఎల్మా రాకేశ్ రెడ్డి తన భార్య రుతుజరెడ్డి(30), కూతుళ్లు వరణ్య(5), కియారా(2)తో కలిసి శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రుతుజ తలకు తీవ్ర గాయమై దుర్మరణం చెందగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.