AP: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాతర్లపల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కృష్ణంరాజు(15), శ్రీరాములు(14)గా స్థానికులు గుర్తించారు.