SKLM: బూర్జ మండలం డొంకలపర్త వద్ద ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే ఆ ప్రాంతంలో ప్రతి రోజూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, సంబంధిత అధికారులు చొరవ తీసుకొని గోతులను పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.