తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నేడు సినీ ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి చర్చించారు. ఆ సమస్యలను పరిష్కరిస్తానని వారికి మంత్రి హామీ ఇచ్చారు.
హనుమాన్ చాలీసా కేసులో రానా దంపతుల పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. రానా దంపతులు ఏప్రిల్ 2022లో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా పఠించాలని పట్టుబట్టారు.
ఢిల్లీలో మూడు గంటలకు పైగా ఇండియా కూటమి నేతలు పలు విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థిపై కూడా ప్రధానంగా చర్చలు జరిపి తమ ప్రతిపాదనలను తెలియజేశారు.
దొంగతనానికి వచ్చి, రేప్ చేసి, మర్డర్ చేసిన హంతకుల కోసం పోలీసులు ఏం చేశారు. వారిని ఎలా పట్టుకున్నారు అనేది కన్నూర్ సినిమా. ఈ ప్రాసెస్‌లో పోలీసులపై ఎంత పొలిటికల్ ప్రెజర్ ఉంటుందో?
లంచం తీసుకున్న పోలీసును సోసైటీ ఎలా చూస్తుందో. ఇలాంటి పరిస్థితుల్
ఈ సంవత్సరం అత్యధికంగా సంపాదించిన వారి లిస్ట్‌లో అదానీ, అంబానీలను వెనక్కి నెట్టి సావిత్ర జిందాల్ ముందంజలో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ జాబితాను విడుదల చేసింది.
మిచాంగ్ సైక్లోన్ తర్వాత ఇప్పుడు భారీ వర్షాల కారణంగా తమిళనాడులో జనజీవనం దుర్భరంగా మారింది. దక్షిణ తమిళనాడులో వరదల పరిస్థితి నెలకొంది. వరదల కారణంగా తూత్తుకుడి, తిరుచెందూరు సమీపంలోని శ్రీవైకుంటంలో దాదాపు 800 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.
కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో పది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో న్యూ ఇయర్ వేడుకలకు జనం సిద్ధమవుతున్నారు.