తన భద్రత విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా.. సెక్యూరిటీ కల్పించడం లేదని లేఖలో పేర్కొన్నారు.
ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. తన డ్యాన్స్‌తో అలరించారు. తన సొంతూరికి చెందిన కళాకారులతో జానపద గీతానికి నృత్యం చేసి సందడి చేశారు.
నేపాల్‌లో ప్రకృతి విలయం పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలిగొంది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించి సుమారు 70 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఈరోజు (November 4st 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు, అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకుందాం.
గత పదేళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయో చూడాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. నిర్మల్, ఆర్మూర్, కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమగ్ర కుల గణన చేపడతామని.. టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి గ్రూప్-1 జాబ్ ఇస్తామని ప్రకటించింది.
ఎన్నికల వేళ భారీగా డబ్బు పట్టు బడుతోంది. ఛత్తీస్ గఢ్‌లో ఓ డ్రైవర్ ఇంట్లో భారీగా నగదు దొరికింది. రెండు చోట్ల రూ.5 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ ద్రోహులు అందరూ ఏకం అవుతున్నారని మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని షర్మిల ప్రకటన చేయడంతో మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 9 చోట్ల పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మూడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లును రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.
ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారిని సైబర్ కేటుగాళ్లు వేధించారు. వీడియో కాల్ చేసి, రికార్డ్ చేశారు. తర్వాత డబ్బులు ఇవ్వాలని.. లేదంటే సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అతను సైబర్ పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు.