• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న పుకార్లను నివారించేందుకు జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు అద్దంకిలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. బంక్ నిర్వాహకులు కేవలం వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని, క్యాన్‌లలో నింపరాదని ఆదేశించారు.

April 28, 2026 / 02:44 PM IST

రూ.33.50 లక్షల రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: రాయదుర్గంలోని డ్వామా కార్యాలయంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మంగళవారం వెలుగు గ్రామ సంఘాల వీవోఏలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం పీఎం-అజయ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.33.50 లక్షల రుణాల మంజూరు పత్రాలను మహిళలకు హ్యాండోవర్ చేశారు.

April 28, 2026 / 02:40 PM IST

తిరుపతిలో ఉరితాడు బిగించుకుని నిరసన

తిరుపతిలో ఇంధన కొరత, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు వినూత్న నిరసన చేపట్టారు. CITU ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వరకు డీజిల్ లేక ఆగిపోయిన ఆటోలను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. మెడకు ఉరితాడు బిగించుకుని తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఇంధనం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 02:39 PM IST

నగరిలో సంఘమిత్రలకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ

CTR: నగరి ఎంపీడీవో కార్యాలయంలో DRDA ఆధ్వర్యంలో 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే భాను ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని సంఘమిత్రలకు మొబైల్ ఫోన్లు అందజేశారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు, విధులను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే కోరారు.

April 28, 2026 / 02:33 PM IST

‘ఇంధన కొరతపై ప్రభుత్వానికి చలనం లేదు’

E.G: కేవలం ఏపీలోనే పెట్రోల్, డీజీల్‌ సంక్షోభం, కృతిమ కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, రూరల్ వైసీపీ ఇంఛార్జ్ వేణుగోపాలకృష్ణ విమర్శించారు. మంగళవారం రాజమండ్రిలోని పెట్రోల్ బంకు వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్‌ సంక్షోభం ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదన్నారు.

April 28, 2026 / 02:30 PM IST

చెత్త పేరుకుపోతూ దుర్గంధం

ASR: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలోని పెదలబుడు పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం నుంచి సమ్మెకు దిగారు. గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. సమ్మె కారణంగా పట్టణంలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో అరకులోయ అందాలు మసకబారే పరిస్థితి నెలకొంది.

April 28, 2026 / 02:30 PM IST

ఇంధన కొరతపై కేంద్రానికి ఎంపీ లేఖ

KDP: ఏపీలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. 70% బంకుల్లో “నో స్టాక్” ఉందని పేర్కొంటూ, వెంటనే జోక్యం చేసి సరఫరా మెరుగుపరచాలని కోరారు. ఈ కొరత వల్ల వ్యవసాయం, వ్యాపార రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేదని, ఏపీలోనే సమస్య ఎక్కువగా ఉందని ఎంపీ పేర్కొన్నారు.

April 28, 2026 / 02:30 PM IST

త్వరలో గుంటూరు-కనిగిరి మధ్య ప్యాసింజర్ రైలు

ప్రకాశం: టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విజ్ఞప్తి మేరకు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుంటూరు నుంచి గుండ్లకమ్మ మీదుగా కనిగిరికి ప్రతిరోజూ ఒక డెమో రైలు నడపాలని నిర్ణయించారు. ఈ రైలు గుంటూరులో ఉదయం 8:30కు బయలుదేరి మధ్యాహ్నం 1గంటకు కనిగిరికి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు కనిగిరి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు గుంటూరుకు చేరుతుందని అధికారులు తెలిపారు.

April 28, 2026 / 02:29 PM IST

కూటమి నిర్లక్ష్యంమే ఈ పెట్రోల్ కొరత

గుంటూరు 48వ డివిజన్ పరిధిలో గల, రెడ్డిపాలెం గ్రామంలో HP పెట్రోల్ బంక్‌ను బలసాని మంగళవారం సందర్శించారు. వాహనదారులతో మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ కొరత వలన పడుతున్న ఇబ్బందులు ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ తెలుసుకున్నారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంమే అని వారు అన్నారు

April 28, 2026 / 02:28 PM IST

ఇంధన కొరతపై సీపీఎం ఆగ్రహం

కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఇవాళ సీపీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాపార వర్గాలు లాభాల కోసం కొరత సృష్టిస్తున్నాయని నేతలు ఆరోపించారు. ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.

April 28, 2026 / 02:23 PM IST

ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం

SKLM: పలాస మండలం బంటుకొత్తూరు పంచాయతీ పెద్ద నారాయణపురం గ్రామంలోని పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులను తెలుగుదేశం నాయకులు నిమ్మన గోపాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయమే భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ గుంట హారతి, కార్యకర్తలు, ఉపాధి హామీ శ్రామికులు పాల్గొనడం జరిగింది.

April 28, 2026 / 02:17 PM IST

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం గృహాలలో ఛైర్మన్ ఆకస్మికతనిఖీలు

TPT: శ్రీకాళహస్తీశ్వరాలయ ఛైర్మన్ గంగాసదన్, కైలాస సదన్ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మిటరీల్లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, భక్తులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులకు వసతి పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, గదులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ మెరుగైన సేవలందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

April 28, 2026 / 02:16 PM IST

307వ మెగా రక్తదాన శిబిరం విజయవంతం

అన్నమయ్య: రాయచోటిలో నిర్వహించిన 307వ మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని ప్రముఖ సంఘ సేవకులు, హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ ఆర్గనైజేషన్ తెలుగు రాష్ట్ర అధ్యక్షులు డా. సయ్యద్ మైనుద్దీన్ తెలిపారు. వేసవి కాలంలో రక్త కొరత తీవ్రంగా ఉంటుందని, అందరూ రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

April 28, 2026 / 02:15 PM IST

భావనారాయణ స్వామి ఆలయంలో సమీక్ష సమావేశం

బాపట్లలోని భావనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పలు ముఖ్య సూచనలు చేశారు. బాపట్లకు మూలదైవంగా భావించే భవదేవుడు ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉందన్నారు. సుమారు 1433 సంవత్సరాలుగా స్వామి ఇక్కడ కొలువై భక్తులను దీవిస్తున్నారని పేర్కొన్నారు.

April 28, 2026 / 02:14 PM IST

జనగణన పారదర్శకంగా జరగాలి: తహసీల్దార్

PPM: గుమ్మలక్ష్మీపురంలో తహసీల్దార్ శేఖరం జనగణన ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ నెల 30తో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ముగుస్తుందని, మే 1 నుంచి ప్రారంభమయ్యే జనగణనకు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు.

April 28, 2026 / 02:11 PM IST