WG: జిల్లాలో నిర్మాణం పూర్తయిన మల్టీపర్పస్ ఫెసిలిటీ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి కమిటీల సమావేశంలో ఆమె మాట్లాడారు. నాబార్డ్ ఆధ్వర్యంలో మంజూరైన 24 గోడౌన్లలో 14 పూర్తయ్యాయని, ఏడు నిర్మాణ దశలో ఉన్నాయని, మరో మూడు పనులు ప్రారంభం కావాల్సి ఉందని వివరించారు.
KDP: CM చంద్రబాబు పాలన వైఫల్యాలపై రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు YCP రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం ప్రొద్దుటూరులో మాట్లాడుతూ.. జూన్ 4, 8, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. CBN అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేదన్నారు.
KDP: ఉద్యోగ జీవితంలో రిటైర్మెంట్ సహజమే అయినా,పోలీసుగా ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని జిల్లా SP విశ్వనాథ్ అన్నారు. శనివారం DPOలో పదవీ విరమణ చేస్తున్న ఎస్ఐలు శ్రీధర్ బాబు, జయపాల్, రామకృష్ణ, ASI ప్రసాద్,హెడ్ కానిస్టేబుల్ వెంకటరాముడులను ఆయన సత్కరించారు. విధి నిర్వహణలో వారు కనబరిచిన అంకితభావాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ,వీడ్కోలు పలికారు.
SKLM: మెగా డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని బీసీ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పిలి జగదీష్ అన్నారు. 16,347 పోస్టులను 148 రోజుల్లోనే భర్తీ చేశామని, 5.77 లక్షల దరఖాస్తులు రాగా 87.8% మందికి కోరుకున్న కేంద్రాలు ఇచ్చామని తెలిపారు. 2019-2024 మధ్య డీఎస్సీ ఇవ్వని వైసీపీ ఇప్పుడు దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.
KDP: ప్రొద్దుటూరులో ప్రముఖగైనకాలజిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి ఈరోజు ఉదయం మృతిచెందారు. గతకొంతకాలంగా ఆమె ఆరోగ్యంతో బాధపడుతున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ఈమె అవార్డుఅందుకున్నారు. వేలసంఖ్యలో కాన్పులు చేసారని ఆమెకు ఈప్రాంతంలో మంచి పేరు రేపు ఉదయం అంతక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
ELR: ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద కుక్కునూరు మండలంలోని రావిగూడెం పంచాయతీ చీపురుగూడెం, బండారుగూడెం గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. రూ. 65 లక్షల వ్యయంతో 13 కిలో వాట్ల, 12 కిలో వాట్ల సోలార్ ఆఫ్‌గ్రిడ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి 85 ఆదివాసీ కుటుంబాలకు విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.సాల్మన్ రాజు ప్రారంభించారు.
NTR: జగ్గయ్యపేటలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండా పుస్తకాల విక్రయం పేరుతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నాయని SFI ఆరోపించింది. ఫీజు నియంత్రణ చట్టానికి విరుద్ధంగా అదనపు ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని పేర్కొంది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఎంఈవోకు వినతిపత్రం అందజేసిన ఎస్‌ఎఫ్‌ఐ, స్పందన లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.
అన్నమయ్య: టీడీపీ నాయకుడు చప్పిడి మహేష్ నాయుడు జన్మదిన వేడుకలు శనివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చప్పిడి సోదరుల నివాసానికి విచ్చేసిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం మహేష్ నాయుడితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షుడు రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
TPT: పుత్తూరు మండలం చిన్నరాజుకుప్పంలో వై. ప్రసాద్ నాయుడుపై జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్‌ఐ బి. వెంకటలక్ష్మి తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే రాజేంద్ర (38), రవి (36), సంతోష్ (20), నరేశ్ (39) ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
VZM: బొబ్బిలి నియోజకవర్గ వ్యవసాయశాఖ అధికారులతో ఇవాళ బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన సమీక్ష నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వబోయే ఎరువుల కార్డుపై కొందరు రైతులకు ఉన్న అనుమానాలను తొలగించేలా నాలుగు మండలాల AOలు ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.. అలానే ఈ-పంట నమోదు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలన్నారు.
VSP: ద్వారక పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వి. త్రినాధ్ బీసీసీఐ నిర్వహించిన క్రికెట్ కోచింగ్ లెవల్-0 కోర్సులో 97 మార్కులు సాధించి లెవల్-1 కోర్సుకు అర్హత పొందారు. ఏపీ పోలీస్ శాఖ నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అండర్-15లో ఒకసారి, అండర్-19లో రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
PPM: పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా NCD అధికారి డా.టి జగన్మోహన్ రావు అన్నారు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పొగాకు ఆకర్షణకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పొగాకు సేవించేవారు అనారోగ్య కారణాలకు గురవుతున్నారని తెలిపారు.
SKLM: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 1 నుంచి 5 వరకూ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యావరణం పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు.
కోనసీమ: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి హరిప్రసాద్ శనివారం కోరారు. 25-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు, పురుషులు దీనికి అర్హులని తెలిపారు. మంచి ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలు naipunyam.ap.gov.in వెబ్ సైట్‌లో చూడాలన్నారు.
NTR: జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో 60 రోజుల హుండీ ఆదాయం రూ. 91.95 లక్షలు నమోదైంది. హుండీ లెక్కింపులో 25 గ్రాముల మిశ్రమ బంగారం, 380 గ్రాముల మిశ్రమ వెండి లభించాయి. అలాగే అమెరికా, లండన్, బ్రెజిల్, లిబియా దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు.