• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

“పెట్రోల్, డీజిల్‌పై వదంతులు నమ్మకండి”

ATP: గుత్తిలోని పరమేశ్వరయ్య పెట్రోల్ బంకును డిప్యూటీ తహశీల్దార్ సూర్యనారాయణ ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ కొరత ఉందని వదంతులు నమ్మవద్దని పెట్రోల్ నిలువలు ఉన్నాయని ఎక్కడ కొరత లేదని వారు తెలిపారు. ప్రజలు పెట్రోల్, డీజిల్ నిల్వ ఉంచిన బ్లాక్ మార్కెట్‌లో అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు డిప్యూటీ తహశీల్దార్ హెచ్చరించారు.  

April 26, 2026 / 01:41 PM IST

మే నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే.!

TPT: తిరుమలలో మే నెలలో పలు విశేష పర్వదినాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మే 1న కూర్మ జయంతి, పౌర్ణమి గరుడసేవ, మే 2న అన్నమాచార్య జయంతి, మే 3న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం జరుగనున్నాయి. అలాగే మే 12న హనుమ జ్జయంతి, మే 21న నమ్మాళ్వార్ ఉత్సవారంభం, మే 26న వరదరాజస్వామి వర్ష తిరునక్షత్రం, మే 30న నమ్మాళ్వార్ శాత్తుమొర నిర్వహించనున్నారు.

April 26, 2026 / 01:37 PM IST

మంత్రి సవితను కలిసిన ఎస్సై రాఘవయ్య

సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవితను ఎస్సై రాఘవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ బాధ్యతలు స్వీకరించిన నుంచి ఆయన మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు సేవలపై మంత్రి పలు సూచనలు చేశారు.

April 26, 2026 / 01:35 PM IST

ఎస్‌ఆర్ పురంలో మహాభారత ఉత్సవాలు

CTR: ఎస్‌ఆర్ పురంలో జరుగుతున్న మహాభారత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం “దుర్యోధన వధ” కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కళాకారులు మహాభారత ఘట్టాన్ని ఆవిష్కరించగా, భీముడు-దుర్యోధన యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు చేశారు.

April 26, 2026 / 01:34 PM IST

రాజమండ్రిలో ‘అనగనగా తూర్పులంకలో’ ఆడిషన్స్

E.G: రాజమండ్రిలోని హోటల్ జగదీశ్వరిలో ఆదివారం ‘అనగనగా తూర్పులంకలో’ చిత్ర ఆడిషన్స్ నిర్వహించారు. లహరి మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు పవర్ వినయ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.

April 26, 2026 / 01:29 PM IST

29న చేపల వేటకు బహిరంగ వేలం

NLR: సంగం-బుచ్చి మండలాల పరిధిలోని KD రిజర్వాయర్‌లో చేపల వేట హక్కుల కోసం ఏప్రిల్ 29న ఉదయం 10 గంటలకు వేలం జరగనుంది. బుచ్చి ఎంపీడీవో కార్యాలయంలో జరిగే బహిరంగ వేలానికి ఆసక్తి ఉన్నవారు హాజరు కావాలని మత్స్యశాఖ అధికారులు ఆదివారం కోరారు. రూ.10,000 ఈఎండీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనికి 1/3 లీజు ఆర్డర్‌కు ముందు చెల్లించాలని సూచించారు.

April 26, 2026 / 01:25 PM IST

రేపు ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరంలో వికలాంగులకు ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సంస్కృతి సేవా సమితి, భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఈ శిబిరం జరుగుతుంది. పోతుకుంట రోడ్డులోని కొత్త ఆసుపత్రిలో కాళ్లు, చేతులు లేని వారికి ఉచితంగా కృత్రిమ అవయవాలు అమర్చనున్నారు.

April 26, 2026 / 01:18 PM IST

ప్రత్యేక అలంకరణలో ముద్దసానమ్మ అమ్మవారు

మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లి సమీపంలో వెలసియున్న పురాతన గ్రామదేవత శ్రీ ముద్దసానమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు భక్తులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీప పట్టణాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

April 26, 2026 / 01:13 PM IST

వేసవి శిక్షణా శిబిరం కరపత్రాల ఆవిష్కరణ

AKP: నర్సీపట్నం శాఖ గ్రంథాలయం వేసవి శిక్షణ శిబిరాల కరపత్రాలను ఆదివారం ఎంఈవోలు తలుపులు, నాగేంద్ర ఆవిష్కరించారు. శాఖ గ్రంథాలయ అధికారిని దమయంతి మాట్లాడుతూ.. ఈనెల 28వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలు మొదలవుతాయని పేర్కొన్నారు. అందులో భాగంగా విద్యార్థులను గ్రంథాలయానికి పంపించాలని కోరారు. చిన్నారులకు విభిన్న అంశాలపై శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.

April 26, 2026 / 01:12 PM IST

ఘనంగా అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం

SKLM: కొత్తూరు మండలం కౌసల్యపురం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి 14వ వార్షికోత్సవం ఘనంగా ఆదివారం నిర్వహించబడింది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి రూ.10,000 విరాళంగా అందజేశారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

April 26, 2026 / 01:09 PM IST

రేపు పలమనేరులో పోలీసు పీజీఆర్ఎస్

CTR: చిత్తూరులో ప్రతి సోమవారం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ వారం పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. దీనిని ప్రజలు గుర్తించాలని ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సమస్యలు తెలియజేసే వారు పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి రావాలని అందులో సూచించారు.

April 26, 2026 / 01:05 PM IST

మహిళ మిస్సింగ్.. తల్లిదండ్రులకు అప్పగింత

GNTR: ఒడిశాకు చెందిన మహిళ ఫిరంగిపురం వచ్చి తిరిగి వెళ్తూ తప్పిపోయింది. ఈ నెల 20న తల్లిదండ్రులు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఫిరంగిపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె మహారాష్ట్రలో ఉన్నట్లు గుర్తించి మహిళను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

April 26, 2026 / 01:05 PM IST

నేడు విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

విశాఖ: రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఇవాళ విశాఖ రానున్నారు. రాత్రి 9.40 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని రాత్రికి నగరంలోనే బస చేస్తారు. రేపు విశాఖ వస్తున్న ఉపరాష్ట్రపతి, సీఎంకి స్వాగతం పలికి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం గూగుల్ డాటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబుతో పాల్గొని, ఆరోజు సాయంత్రం విజయవాడకు వెళ్తారు.

April 26, 2026 / 01:04 PM IST

ఒడిశా పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం

మన్యం: సాలూరు నియోజకవర్గ పరిధిలోని వివాదాస్పద కోటియా గిరిజన గ్రామాల్లో ఒడిశా పోలీసుల తీరుపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగణన లెక్కలకు సహకరించలేదనే నెపంతో ఎగువశింబి గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

April 26, 2026 / 01:03 PM IST

సోనో స్కాన్స్ కేంద్రాన్ని ప్రారంభించిన వైసీపీ నేత

NDL: డోన్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోనో స్కాన్స్ కేంద్రాన్ని ఆదివారం వైసీపీ యువనేత బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు సకాలంలో స్కానింగ్ సేవలు అందించాలని నిర్వాహకులకు బుగ్గన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 26, 2026 / 01:02 PM IST