• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రకృతి కోసం ప్లాస్టిక్ వాడకం తగ్గించండి: GVMC

VSP: సింగల్ యూజ్ ప్లాస్టిక్ ప్రకృతిని, మానవ జీవనశైలిని కలుషిత పరుస్తోందని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పక్షులు, జీవరాశులు, జలరాశులు రోగాల బారిన పడుతున్నాయన్నారు. ప్రజలు దీనికి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని, సముద్రపు జీవ రాశులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

April 22, 2026 / 10:13 AM IST

చిన్నారిని ముద్దాడిన YS జగన్

KDP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం పులివెందులకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్య కర్తలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఇదే సందర్భంలో ఓ చిన్నారి YS జగన్‌ను చూసేందుకు కుటుంబ సభ్యులతో రావడం, దీనిని జగన్ గమనించి తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా చిన్నారిని పిలిపించుకొని ఆప్యాయంగా ముద్దాడారు.

April 22, 2026 / 10:09 AM IST

నువ్వు పంట సాగు లాభదాయకం

AKP: నువ్వు పంట సాగు లాభదాయకంగా ఉంటుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీహరిరావు రైతులకు సూచించారు. మంగళవారం కసింకోట మండలం వెదురుపర్తిలో సాగులో ఉన్న నువ్వు పంటను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునన్నారు. నువ్వు పంట కోత అనంతరం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

April 22, 2026 / 10:07 AM IST

కడపలో ‘స్టాప్,ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం

KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ‘స్టాప్,ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో రహదారులపై పర్యటిస్తూ, లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లను ఆపి అలసట నివారణ కోసం నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

April 22, 2026 / 10:06 AM IST

ఈనెల 25న పుంగనూరులో కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈనెల 25న కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు శిబిరంలో పాల్గొని చికిత్స చేయించుకోవాలని కోరారు.

April 22, 2026 / 09:55 AM IST

అమరావతికి మరో 1529 ఎకరాలు

GNTR: రాజధాని రెండో దఫా భూసమీకరణ కొనసాగుతోంది. అమరావతి పరిధిలోని నాలుగు గ్రామాల రైతులు 1529 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించారు. ఎండ్రాయిలో 580, కర్లపూడిలో 592, పెదమద్దూరులో 342, వైకుంఠపురంలో 15 ఎకరాలు పూలింగ్‌కు వచ్చాయి. ఈ గ్రామాల్లో మొత్తం 7,562 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ప్రస్తుతానికి 1529 ఎకరాలే వచ్చినట్లు సీఆర్డీఏ అధికారులు మంగళవారం వెల్లడించారు.

April 22, 2026 / 09:33 AM IST

డిగ్రీ ప్రథమ సెమిస్టర్ ఫలితాల విడుదల

ATP: అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ మొదటి ఏడాది ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ప్రిన్సిపాల్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 1,447 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 672 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు ముగిసిన రెండు నెలల్లోపే ఫలితాలు విడుదలయ్యాయి.

April 22, 2026 / 09:27 AM IST

పుట్టపర్తికి వచ్చిన మర్రి శశిధర్ రెడ్డి

సత్యసాయి: పుట్టపర్తి విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాంతిభవన్‌లో సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

April 22, 2026 / 09:18 AM IST

జీవీఎంసీ కమిషనర్ పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్

VSP: జిల్లాలో సైబర్ మోసాలపై ఎప్పటికప్పుడు పోలీసులు అవగాహన కల్గిస్తున్నారు. అయితే సైబర్ కేటుగాళ్లు మాత్రం రోజురోజుకీ రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్ ఫోటోతో నకిలీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా జీవీఎంసీ అధికారులకు డబ్బులు అడుగుతున్నట్టు మెసేజ్‌లు పంపారు.

April 22, 2026 / 09:14 AM IST

గుండెపోటుతో లైన్‌మైన్ కన్నుమూత

ASR: అంజలి శనివారం గ్రామానికి చెందిన లైన్‌మైన్ ఎర్రం దొర గుండెపోటుతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. జి. మాడుగుల మండలంలో నుర్మతి పరిధిలో లైన్‌మైన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన నర్సీపట్నం తన స్వగృహం వద్ద మంగళవారం రాత్రి ఆకస్మత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది.

April 22, 2026 / 09:14 AM IST

మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ

ప్రకాశం: జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద మంగళవారం రాత్రి చాతుకుపాడు గ్రామానికి చెందిన శిరోమణి అనే మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేశారు. వ్యక్తిగత పనులపై మహిళ ఒంగోలు వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో దొంగలు తన బంగారు గొలుసు చోరీ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 22, 2026 / 09:13 AM IST

బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జగన్

KDP: కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈనెల 26న అనంతపురం లలిత కళా పరిషత్లో నిర్వహించనున్న బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. గ్రామస్థాయి వరకు వెళ్లి బీసీల సమస్యలపై చైతన్యం కల్పించాలని జగన్ సూచించారు.

April 22, 2026 / 09:10 AM IST

బస్సు షెల్టర్ నిర్మాణం చేపట్టాలి

PPM: ఖడ్గవలస కూడలిలో బస్సు షెల్టరు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ సరైన విశ్రాంతి భవనం లేకపోవడంతో పార్వతీపురం, పాలకొండ, కురుపాం గిరి జన మండలాలు, ఒడిశా ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల కోసం వైకూడలి వద్ద దుకాణాల ముందు, రోడ్డుపై నిలబ డాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో బస్సు షెల్టరు నిర్మాణానికి తమవంతు కృషి చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.

April 22, 2026 / 09:05 AM IST

లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ రీజనల్ ఛైర్మన్‌గా పేరిచర్ల

పశ్చిమ గోదావరి జిల్లా లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ రీజనల్ ఛైర్మన్‌‌గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పేరిచర్ల మురళీ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం వాకర్స్ క్లబ్‌లో వివరాలు వెల్లడించారు. గతకొన్నేళ్లుగా లైన్స్ క్లబ్, డైమండ్ క్లబ్, పేరిచర్ల ఫౌండేషన్ ద్వారా చేసిన వివిధ సేవలకు గాను తనకు పదవి ఇచ్చినట్లు నియామక పత్రాన్ని విడుదల చేశారు.

April 22, 2026 / 09:05 AM IST

వైసీపీ ఇన్‌ఛార్జ్‌కు నోటీసులు

SKLM: వైకాపా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌కు పోలీసులు మంగళవారం నోటీసులు అందజేశారు. పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పటికీ ముందస్తు అనుమతి లేకుండా ఈ నెల 9న పార్టీ శ్రేణులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టిన ఘటనపై పోలీసులు వివరణ కోరారు. ఎస్సై రాము స్థానిక పార్టీ కార్యాలయంలో తిలక్‌కు నోటీసులు ఇచ్చారు.

April 22, 2026 / 09:03 AM IST