• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నీటి సరఫరా అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ సమావేశం

నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పంచాయతీరాజ్, నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేశారు. ఆమె మాట్లాడుతూ… మంజూరు చేసిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అలా కాని పక్షంలో ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పనులు మంజూరు చేయుటకు తగు ప్రతిపాదనలు పంపాలన్నారు.

April 28, 2026 / 03:50 PM IST

ప్రత్తిపాడు అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు జడ్పీ హాల్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో సమావేశమై స్వర్ణాంధ్ర విజన్-2047పై చర్చించారు. మౌలిక వసతులు, రహదారులు, తాగునీటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడొద్దని, ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు.

April 28, 2026 / 03:49 PM IST

కోన ఫిల్లింగ్ స్టేషన్‌లో తనిఖీలు

బాపట్ల పట్టణంలోని కోన ఫిల్లింగ్ పెట్రోల్ బంకులో మంగళవారం అధికారులు తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్, సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. బంకులో ఉన్న ఇంధన నిల్వలు, నాణ్యత, పంపిణీ తీరును వారు నిశితంగా పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇంధన విక్రయాలు జరగాలని బంక్ నిర్వాహకులకు సూచించారు.

April 28, 2026 / 03:48 PM IST

‘నిరుపేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం’

SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఆశాకిరణంగా మారిందని అన్నారు.

April 28, 2026 / 03:45 PM IST

‘వైసీపీ ఉనికి కోసమే ఆరోపణలు’

సత్యసాయి: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఉనికి కోసం మంత్రి సవితపై ఆరోపణలు చేస్తున్నారని సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, టీడీపీ పట్టణ కన్వీనర్ శ్రీరాముల విమర్శించారు. మంగళవారం పెనుకొండలో వారు మాట్లాడుతూ.. పెనుకొండలో అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పట్టించుకోలేదని, ఇప్పుడు విమర్శలు చేయడం తగదని అన్నారు.

April 28, 2026 / 03:40 PM IST

ఒక్క కిలో కూడా తారం తీయవద్దు: ఎమ్మెల్యే

NTR: రెడ్డిగూడెంలో మంగళవారం ప్రజాదర్బారులో పలువురు రైతులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుని కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ సతీష్‌తో ఫోన్లో మాట్లాడి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలన్నారు. రబీ ధాన్యాన్ని 3రోజుల వ్యవధిలోనే కొనుగోలు చేస్తామన్నారు. ఒక్క కిలో కూడా తారం తీయవద్దని ఆదేశించారు.

April 28, 2026 / 03:36 PM IST

‘నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి’

CTR: వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యపై గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనను ఖండిస్తూ నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం జరుగుతుందని హామీ ఇస్తూ సానుభూతి తెలిపారు.

April 28, 2026 / 03:36 PM IST

నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం

VSP: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గంటా పాల్గొన్నారు.

April 28, 2026 / 03:36 PM IST

‘నీటి సంరక్షణ మనందరి బాధ్యత’

అన్నమయ్య: నీటి సంరక్షణ మనందరి బాధ్యత అని ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ అన్నారు. మంగళవారం కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని రంగమ్మ చెరువులో ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధికారులు, కూటమి నాయకులతో కలసి చెరువులో పూజలు చేసి జల హారతి ఇచ్చారు. ప్రతి నీటి బొట్టునూ సంరక్షించి భవిష్యత్తు తరాలకు, రైతులకు భరోసా ఇద్దామన్నారు.

April 28, 2026 / 03:32 PM IST

‘పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలి’

PPM: పాలకొండలోని పలు పెట్రోల్ బంకులను ఎమ్మెల్సీ విక్రాంత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ.. ఏపీలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ప్రజలకు కుంటి సాకులు చెబుతూ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ప్రభుత్వం తక్షణమే పరిస్థితి చక్కదిద్దాలన్నారు.

April 28, 2026 / 03:31 PM IST

కృత్రిమ కొరత సృష్టిస్తే బంకులు సీజ్

బాపట్ల నగరంలోని పెట్రోల్ బంకులను ఆర్డీవో గ్లోరి మంగళవారం తనిఖీ చేశారు. ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తే బంకులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇంధన కొరత వదంతులను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

April 28, 2026 / 03:30 PM IST

మద్యం నాణ్యతకు ‘సురక్ష’యాప్ దిక్సూచి

W.G: తాడేపల్లిగూడెంలో ఎక్సైజ్ అధికారుల సమావేశం ఇవాళ జరిగింది. మద్యం నాణ్యతకు ‘సురక్ష’ యాప్ దిక్సూచిగా పనిచేస్తుందని జిల్లా ఎక్సైజ్ అధికారి బి. సుబ్బారావు తెలిపారు. మే 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. అనంతరం మద్యం షాపులను తనిఖీ చేసి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.

April 28, 2026 / 03:30 PM IST

రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

KRNL: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను ఇవాళ కలెక్టర్ డా.ఏ.సిరి స్వయంగా పరిశీలించారు. భూ సర్వే పనులు పారదర్శకంగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆమె ఆదేశించారు. భూ వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, తదితరులు పాల్గొన్నారు.

April 28, 2026 / 03:30 PM IST

పుస్తక పఠనంతోనే ఉజ్వల భవిష్యత్తు: MLC

KDP: నిరంతర పుస్తక పఠనం ద్వారానే విద్యార్థులు విజ్ఞానవంతులుగా మారి ఉజ్వల భవిష్యత్తును అందుకుంటారని MLC రామగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. విద్యార్థలు సోషల్ మీడియాకు బానిసలై విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

April 28, 2026 / 03:30 PM IST

సీఐ వరలక్ష్మిపై చర్యలు తీసుకోవాలి: రంగనాయుడు

NDL: డోన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి అక్రమంగా విక్రయించారని ఇవాళ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి, ఆమెను సర్వీస్ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల సోమనాథ్ వద్ద 379 మద్యం సీసాలు పట్టుబడగా, వాటిని సీఐ అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు.

April 28, 2026 / 03:30 PM IST