• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వాచ్మన్ ఉద్యోగం పేరుతో రూ.1.5 లక్షల మోసం

NDL: మిడుతూరు (మం) రోళ్ళపాడు గ్రామానికి చెందిన శివుడిని విద్యుత్ శాఖలో వాచ్మన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి కోడుమూరుకు చెందిన వీరేష్ రూ.1.50లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. ఉద్యోగం ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితుడు సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుని డబ్బులు ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు.

April 27, 2026 / 09:29 PM IST

ఇంధన కొరతపై ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు

సత్యసాయి: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇంధన కొరత లేదా ధరల వ్యత్యాసంపై ప్రజలు 08555 288566 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. వినియోగదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారుల బృందం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

April 27, 2026 / 09:00 PM IST

కడపలో రేషనలైజేషన్ విధానం అమలు

కడప జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయాల నేపథ్యంలో తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కార్లు, చిన్న సరకు వాహనాలకు 30 లీటర్లు, లారీలు, ప్రైవేట్ బస్సులకు 100 లీటర్లు, వరికోత యంత్రాలకు 80 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ ఇవ్వనున్నారు. అంబులెన్స్‌లు, ప్రజా రవాణా వాహనాలకు ఇంధన సరఫరా కొనసాగుతుందన్నారు.

April 27, 2026 / 08:55 PM IST

‘పెట్టుబడుల గమ్యంగా విశాఖ’

విశాఖ పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా మారుతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆనందపురం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. చంద్రబాబు విజన్‌తో విశాఖ ఐటీ హబ్‌గా మారనుందన్నారు.

April 27, 2026 / 08:51 PM IST

బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా డీఎస్పీకి ఆహ్వానం

NDL: కోవెలకుంట్లలో వెలసిన పాండురంగ విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావుని ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన్ గుద్దేటి చిన్న వెంకటసుబ్బారెడ్డి(గుండయ్య), వైస్ ఛైర్మన్ కరిమద్దుల లక్ష్మీ నాగేంద్రబాబు కలిశారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి హాజరుకావాలని ఆయనను కోరారు.

April 27, 2026 / 08:44 PM IST

డ్రోన్ నిఘాతో అసాంఘిక శక్తులపై పోలీసుల కట్టడి

అన్నమయ్య: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ముమ్మర నిఘా చేపట్టారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు కొండలు, గుట్టలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగుతోంది. పేకాట, నాటుసారా, గంజాయి రవాణా వంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

April 27, 2026 / 08:41 PM IST

30న జిల్లాస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు

KDP: ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఈ నెల 30న సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు బాష అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా సోమవారం తెలిపారు. స్త్రీ, పురుషులకు 100,200,400,800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హై జంప్, షాట్ పుట్ డిస్కస్ త్రో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులన్నారు.

April 27, 2026 / 08:40 PM IST

కోసిగిలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు

KRNL: మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడం, వారి రక్షణపై అవగాహన కల్పించేందుకు సోమవారం సాయంత్రం స్థానిక తేరు బజార్ ఆవరణలో సీఐ భారీ బహిరంగ సభ నిర్వహించారు. నిత్యం జరుగుతున్న అగాయిత్యాల పట్ల మహిళలు, యువతులు ఎలా అప్రమత్తంగా ఉండాలో పోలీసులు వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు ‘శక్తి యాప్’ ఎలా ఉపయోగించాలో వారికి తెలియజేశారు.

April 27, 2026 / 08:37 PM IST

‘ఇంధనం కొరతపై ప్రభుత్వం స్పందించాలి’

ఏలూరులోని CPI ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు పెట్రోల్ బంకుల్లో పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలన దేశంలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ కోసం ప్రజలు బంకుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు.

April 27, 2026 / 08:37 PM IST

శుక్లముల ఆపరేషన్‌కు 46 మందిని తరలింపు

BPT: రోటరీ క్లబ్ ఆఫ్ పంగులూరు ఆధ్వర్యంలో 46 మందికి కంటి శుక్లముల ఆపరేషన్ చేయించేందుకు సోమవారం పెదకాకానిలోని శంకర్ నేత్రాలయానికి తరలించారు. ఈ నెల 25న పంగులూరులోని రోటరీ భవన్ వద్ద నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి 120 మంది హాజరు కాగా అందులో 75 మందికి కంటి శుక్లముల ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు 46 మందిని బస్సులో తీసుకెళ్లారు.

April 27, 2026 / 08:35 PM IST

మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఆదాయం.!

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెంలో వెలసి ఉన్న నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ.1,88,233 ఆదాయం వచ్చినట్లు ఈవో గిరిరాజు నర్సింహబాబు సోమవారం తెలిపారు. టికెట్లు, లడ్డు ప్రసాదం విక్రయం, శాశ్వత అన్నదానం, మహాప్రాకార నిర్మాణ విరాళాలు, పంచామృత అభిషేకాలు, శ్రీపాద కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.

April 27, 2026 / 08:34 PM IST

‘వదంతులు నమ్మవద్దు’

SKLM: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం అసత్యమని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు. అన్ని బంకుల్లో ఇంధనం సమృద్ధిగా ఉందని స్పష్టం చేశారు. వదంతులను నమ్మి అధికంగా నిల్వ చేయొద్దని హెచ్చరించారు. అక్రమ నిల్వలు, నల్లబజారు, తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుమానాస్పద విషయాలు గమనిస్తే 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

April 27, 2026 / 08:34 PM IST

రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

NDL: రాజమహేంద్రవరం నగరంలోని ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ ధ్వజస్తంభ ఊరేగింపు మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందన్నారు.

April 27, 2026 / 08:34 PM IST

త్రైమాసిక పన్ను గడువు 30లోపు – డీఆర్‌టీఓ హెచ్చరిక

TPT: జిల్లాలో వాణిజ్య వాహనాల యజమానులు త్రైమాసిక పన్నును ఈ నెల 30లోపు పెనాల్టీ లేకుండా చెల్లించాలని డీఆర్‌టీవో కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. గడువు దాటితే మేలో 100%, జూన్‌లో 200% పెనాల్టీ విధిస్తారు. బకాయి పన్నులు, కాంపౌండింగ్ ఫీజులు వెంటనే చెల్లించాలన్నారు. పన్నులు చెల్లించని వాహనాలపై ప్రత్యేక బృందాలు కఠిన చర్యలు తీసుకుంటాయన్నారు.

April 27, 2026 / 08:31 PM IST

‘ఈ నెల 30లోపు పెనాల్టీ లేకుండా చెల్లించాలి’

TPT: జిల్లాలో వాణిజ్య వాహనాల యజమానులు త్రైమాసిక పన్నును ఈ నెల 30లోపు పెనాల్టీ లేకుండా చెల్లించాలని డీఆర్‌టీవో కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. గడువు దాటితే మేలో 100%, జూన్‌లో 200% పెనాల్టీ విధిస్తారు. బకాయి పన్నులు, కాంపౌండింగ్ ఫీజులు వెంటనే చెల్లించాలన్నారు. పన్నులు చెల్లించని వాహనాలపై ప్రత్యేక బృందాలు కఠిన చర్యలు తీసుకుంటాయన్నారు.

April 27, 2026 / 08:31 PM IST