• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘శ్రీవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి’

VSP: తిరుమల శ్రీవారిని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబంపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా శ్రీవారి కటాక్షం ఉండాలని కోరారు.

April 28, 2026 / 07:00 PM IST

‘ఇంధన కొరతపై తక్షణ చర్యలు తీసుకోవాలి’

VZM: జిల్లాలో ఇంధన కొరతపై కూటమి ప్రభుత్వం అధికారులతో తప్పుడు ప్రకటనులు ఇప్పిస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమావ్వాలని, ఇంధన కొరతపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

April 28, 2026 / 07:00 PM IST

బ్యాంకు అధికారులతో కలెక్టర్ సమావేశం

PPM: రుణాల మంజూరులో సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కారించి, రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు మంజూరు కావలసిన బ్యాంకు రుణాలు పెండింగ్ లో ఉండడంపై ప్రత్యేక గ్రీవెన్స్ డే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

April 28, 2026 / 07:00 PM IST

‘పారదర్శకంగా ఎరువులు పంపిణీ జరగాలి’

AKP: రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ధరల విషయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అనకాపల్లిలో వ్యవసాయ అధికారులు, ఏడీఎలు, హోల్సేల్ డీలర్స్‌తో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం ఎరువుల పంపిణీకి ఏపీ ఎయిమ్స్ యాప్ అమలులోకి తీసుకొచ్చిందన్నారు.

April 28, 2026 / 07:00 PM IST

బాల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దుతాం: పద్మలత

PLD: నరసరావుపేటలో పల్నాడు జిల్లాను ‘బాల స్నేహపూర్వక జిల్లా’గా తీర్చిదిద్దుతామని ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు కే.జీ. వెంకట పద్మలత తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన, పిల్లల సంరక్షణపై శాఖల సమన్వయం అవసరమన్నారు. అంగన్వాడీలు, ఆసుపత్రులను పరిశీలించి లోపాల నివారణకు చర్యలు సూచించారు.

April 28, 2026 / 06:55 PM IST

నంద్యాల జిల్లాకు పిడుగుల హెచ్చరిక.!

నంద్యాల జిల్లాలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మెసేజ్ల ద్వారా హెచ్చరికలు పంపింది. మరోవైపు మహానంది మండలంలో ఈదురుగాలులు మొదలవ్వడంతో అరటి రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలి వేగానికి పంట దెబ్బతినే అవకాశం ఉందని భయపడుతున్నారు.

April 28, 2026 / 06:50 PM IST

సబ్సిడీపై ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు హెచ్చరిక

GNTR: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తెనాలి ఏడీఏ రాగల విజయబాబు రైతులకు జాగ్రత్తలు సూచించారు. పీఎంపీఎస్ ద్వారా 30 రకాల విత్తన కిట్లు అందిస్తున్నామని, రూ.1500 విలువైన కిట్లు రూ.1000కే ఇస్తున్నట్టు తెలిపారు. మేలో పచ్చిరొట్టె ఎరువులు సబ్సిడీపై పంపిణీ చేస్తామన్నారు.

April 28, 2026 / 06:45 PM IST

ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రత్యేక చర్యలు: జేసీ

తూ.గో జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. గోకవరం మండలం గుమ్మల్లదొడ్డిలో ఉన్న IOCL, HPCL ఫిల్లింగ్ స్టేషన్లలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇంధన సరఫరా యూనిట్లు, ఆయిల్ కంపెనీల కార్యకలాపాలన పర్యవేక్షించేందుకు జిల్లాలో 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

April 28, 2026 / 06:40 PM IST

BPCL డిపోను పరిశీలించిన జేసీ

ATP: గుత్తిలోని కర్నూల్ రోడ్‌లో గల BPCL డిపోను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఇంఛార్జ్ తహసీల్దార్ సూర్యనారాయణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డిపోలోని స్టాక్ వివరాలను పరిశీలించి డీజిల్, పెట్రోల్ ఎలా సరఫరా చేస్తున్నారో అనే దానిపై ఆరా తీశారు. డిపో 24/7 రన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిల్లింగ్ డిపోను కూడా తనిఖీ చేశారు.

April 28, 2026 / 06:40 PM IST

నాగలాపురం మార్కెట్ కమిటీకి ఛైర్మన్‌గా జాన్సన్

TPT: సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఛైర్మన్‌గా జాన్సన్, వైస్ ఛైర్మన్‌గా మురళి నియమితులయ్యారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేయగా, పలువురు స్థానికులు సభ్యులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

April 28, 2026 / 06:40 PM IST

గుడిపాల పోలీసులకు వినతిపత్రం అందజేత

CTR: వి.కోట జర్నలిస్ట్ జగన్ మోహన్ రెడ్డి హత్యను గుడిపాల మండల జర్నలిస్టులు ఖండించారు. ఇదివరకు సాధారణ దాడులకు పాల్పడుతున్న కొంతమంది దుండగులు హత్యా రాజకీయానికి తెరలేపారని మండిపడ్డారు. హత్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుడిపాల ఏఎస్ఐ మునివేల్‌కు వినతి పత్రం సమర్పించారు.

April 28, 2026 / 06:39 PM IST

కొత్తపేటలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఇందిరమ్మకు స్థానిక TDP నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. టీడీపీ నాయకుడు రామ మద్దిలేటి రెడ్డి కుమార్తె వివాహ ముహూర్తపు వేడుకలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం బీసీ ఇందిరమ్మ పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు.

April 28, 2026 / 06:38 PM IST

పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన తహసీల్దార్

CTR: సదుం మండల కేంద్రంలో పెట్రోల్ బంకులను తహసీల్దారు ప్రమీల మంగళవారం తనిఖీ చేశారు. ఐఓసీ పెట్రోల్ బంకులో మరో రెండు రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. నిబంధనల మేరకే అమ్మకాలు జరపాలని యజమానులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బంకులలో పంపిణీ పర్యవేక్షణకు వీఆర్వోలను నియమించినట్లు చెప్పారు.

April 28, 2026 / 06:36 PM IST

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి: SP

W.G. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యమని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి అన్నారు. గొల్లలకోడేరు కార్యాలయం నుంచి మంగళవారం పోలీసు అధికారులతో ఆయన నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఎన్‌డీపీఎస్‌ కేసుల దర్యాప్తులో నాణ్యత పెంచాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.

April 28, 2026 / 06:35 PM IST

‘ప్రభుత్వ వైఫల్యాల వలనే ఇంధన కొరత’

ELR: ప్రభుత్వ వైఫల్యాల వల్లనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయక కార్యదర్శి వెంకటేశ్వరరావు విమర్శించారు. మంగళవారం ఏలూరు పవర్ పేట కాళీ పెట్రోల్ బంకు వద్ద ఆందోళన చేపట్టారు. అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసిన కూడా నిదర్శనం అన్నారు. వెంటనే పెట్రోలు, డీజిల్ గ్యాస్ కొరతలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 06:33 PM IST