AKP: నర్సీపట్నంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. పెదబొడ్డేపల్లి పెద్దచెరువు వద్ద ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులవ్యవస్థ నిర్మూలనతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని వైసీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఏకా శివ కోరారు.
VZM: మహాత్మ జ్యోతిరావు ఫూలే సమాజానికి చేసిన సేవలను ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇవాళ ఫూలే జయంతిని పురస్కరించుకుని కలక్టరేట్లో ఆయన విగ్రహానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డితో కలసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బహుజనులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేసారన్నారు.
CTR: కుప్పంలో NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.2,550 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 400 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ కంపెనీకి 105 ఎకరాలు ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాంతిపురం (M) చీమనపల్లెలో రూ.989 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. రెండు దశల్లో 450మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని మంత్రి పేర్కొన్నారు.
GNTR: తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకమైన రోజు కావడంతో, ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకుని స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
SKLM: పాతపట్నం మండల కార్యదర్శి లింగాల వెంకటకృష్ణ సోదరుడు లింగాల జీవరత్నం(75) శుక్రవారం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఇవాళ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు మండల ప్రధాన కార్యదర్శి బడియాల బాబురావు ఉన్నారు.
TPT: కర్ణాటకకు చెందిన TTD బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేసినట్లు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన భార్య, కుమారుడు చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. TTDలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బోర్డు సభ్యుడి కుటుంబ సభ్యులు చర్చిలో ఉన్న ఫొటోలు బయటకు రావడంపై విమర్శలు వస్తున్నాయి.
KRNL: మహాత్మ జ్యోతిబా ఫూలే సామాజిక సమానత్వానికి పునాది వేసిన మహనీయుడని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ పేర్కొన్నారు. ఫూలే 199వ జయంతి సందర్భంగా శనివారం ఎంఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది ఎం. రామన్న, జె. హనుమంతు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలిసి పని ప్రదేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజ సంస్కరణకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు లభించాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఏడాదిలోపు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కలెక్టర్ ‘వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్’కు శ్రీకారం చుట్టారు. అధికారులను నెలలో నాలుగు సార్లు గ్రామానికి పంపి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇదే విధానాన్ని అందరూ అనుసరించాలన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం కుశాల పురం పారిశ్రామిక వాడలోని ఓషి యానిక్ శాండ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో సంతోశ్ కుమార్ (36) అనే కార్మికుడు మృతిచెందాడు. పరిశ్రమలోని ఓ పోర్కు లిఫ్ట్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో తలకు, ఛాతికి గాయాలయ్యాయి. జాల్లాలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.
CTR: జిల్లాలోని మసీదులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. మసీదుల నిర్వహణ కమిటీలు, గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్, మౌజన్లు తమ మసీదుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉమీద్ పోర్టల్లో మసీదుల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 25 లోపు వీటిని పూర్తి చేయాలన్నారు.
NLR: విక్రమసింహపురి యూనివర్సిటీ (VSU) 10, 11, 12వ స్నాతకోత్సవాలు మే లేదా జూన్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు స్నాతకోత్సవాలు ఒకేసారి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తేదీలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. 2022-23, 23-24, 24-25 రెగ్యులర్ యూజీ, పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు రావాలని కోరారు.
తూ.గో: కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో రోడ్డు పక్కనే చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డు ఉన్నప్పటికీ పంచాయతీ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. దుర్వాసన వ్యాపించి, చెత్త ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
E.G: నిడదవోలు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి పూలే అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.