• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘సృష్టి క్షేత్రం పనులు అడ్డుకోవడం సమంజసం కాదు’

AKP: నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద అర్థరాత్రి ఘటనపై జనసేన ఇన్‌ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వీధి రౌడీలా వ్యవహరించారని ఆరోపించారు. సృష్టి క్షేత్రం పనులను అడ్డుకోవడం, లారీని ఆపడం, సిబ్బందిని భయపెట్టడం దుర్మార్గమని అన్నారు. ఈ ఘటన శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నమని పెర్కొన్నారు.

April 28, 2026 / 12:11 PM IST

నగరానికి అంతర్జాతీయ గుర్తింపు: జీత్ అదానీ

VSP: విశాఖలో 1 గిగావాట్ హైపర్స్కల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంతో భారత్ ఏఐ రంగంలో ముందడుగు వేసిందని అదానీ గ్రూప్ ఛైర్మన్ జీత్ అదానీ మంగళవారం తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో డిజిటల్ ఇన్ఫ్రా వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. ఇప్పటివరకు ముంబై, చెన్నైకే పరిమితమైన ఈ సెంటర్లు విశాఖకు విస్తరించడం కీలకమని, దీనివల్ల నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు.

April 28, 2026 / 12:11 PM IST

బంక్‌లో ఇంధనంపై 2 లీటర్ల పరిమితి

PPM: పీలేవిడి గ్రామ సమీపంలోని బీపీసీఎల్ పెట్రోల్ బంక్‌లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్‌ను ఒక్కో వాహనానికి రెండు లీటర్ల పరిమితికి మించి ఇవ్వకూడదని స్థానిక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జయకుమార్ ఆదేశించారు. ఈ మేరకు పెట్రోల్ బంక్ యజమానికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇంధన కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నియంత్రణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

April 28, 2026 / 12:10 PM IST

వేసవి దృష్ట్యా గోశాలలో ప్రత్యేక చర్యలు: ఈవో

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన గోశాలలో ఈవో పెంచల కిశోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గోవులకు సమయానికి మేత, పశుగ్రాసం, తాగునీరు అందించాలని సిబ్బందికి సూచించారు. ఎండ తాపాన్ని తగ్గించేందుకు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోశాలను పరిశుభ్రంగా ఉంచుతూ, గోవుల ఆరోగ్యంపై పశువైద్యుడి పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.

April 28, 2026 / 12:07 PM IST

రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎమ్మోల్యే నివాళి

KRNL: ఎమ్మిగనూరులో ఇవాళ అనారోగ్యంతో మృతి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ చంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 28, 2026 / 12:07 PM IST

శిల్పారామంలో హస్తకళలు, ఆర్ట్స్ శిక్షణా శిబిరం

తిరుపతిలోని శిల్పారామంలో మే 1 నుంచి 31 వరకు నెలరోజుల పాటు హస్తకళలు, ఆర్ట్స్ శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. 5 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారికి మూడు కోర్సుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000 కాగా, శిబిర సమయం ఉ. 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేయబడుతుంది. వివరాలకు 88866520‌44 నంబర్ ను సంప్రదించాలన్నారు.

April 28, 2026 / 12:03 PM IST

UPDATE: రోడ్డు ప్రమాదం.. పూర్తి వివరాలు

VZM: పూసపాటిరేగ మండలం పేరాపురం హైవేపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు వీరిని విశాఖకు చెందిన ఇరిగేషన్‌ కాంట్రాక్టర్‌ శీనివాసరావు, కె.సింహాచలం, సామంతుల రమేశ్‌తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

April 28, 2026 / 11:58 AM IST

పెట్రోల్ బంకుల తనిఖీ చేసిన కలెక్టర్

PLD: నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ఉన్న HP, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంక్ యజమానులతో మాట్లాడిన ఆమె, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగించాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

April 28, 2026 / 11:52 AM IST

ఇంధన కొరత.. కలెక్టర్‌తో సీఎం సమీక్ష

KRNL: రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సీఎం చంద్రబాబు ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు డా.ఏ.సిరి, రాజకుమారి, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. బంకులకు ఇంధన సరఫరా విధానంపై సీఎం ఆరా తీశారు. నిరంతరం సరఫరా కొనసాగుతోందని కలెక్టర్లు వివరించారు. సరఫరాలో ఎటువంటి అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

April 28, 2026 / 11:39 AM IST

ఆకాశాన్నంటినా నిమ్మకాయ ధరలు

GNTR: తెనాలిలో నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వేసవిలో వినియోగం ఎక్కువగా ఉండటంతో ధరలు అమాంతంగా పెరిగాయి. పంట పండించే రైతులకు మాత్రం నామ మాత్రపు ధరలే లభిస్తుండగా వ్యాపారుల వద్ద మాత్రం భారీ ధరలు పలుకుతున్నాయి. రిటైల్ మార్కెట్లో డజను నిమ్మ రూ.120-150 చొప్పున విక్రయిస్తున్నారు.

April 28, 2026 / 11:36 AM IST

మనది పనులకు టెంకాయలు కొట్టె బ్యాచ్ కాదు: వేమిరెడ్డి

నెల్లూరు: మనది అభివృద్ధి పనులకు టెంకాయలు కొట్టివొదిలేసే బ్యాచ్ కాదని MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం ఇందుకూరుపేట(M) ముదివర్తిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ముధవర్తి కాజ్వే బ్రిడ్జ్ గత ప్రభుత్వంలో టెంకాయలు కొట్టి వదిలేశారని, చంద్రబాబు 90 శాతం పనులు పూర్తి చేశారన్నారు. రూ.2002 కోట్లతో కాజ్వే త్వరలో పూర్తవుతుందన్నారు.

April 28, 2026 / 11:33 AM IST

విలేకరి హత్య.. దొంగను పట్టించినందుకేనా?

CTR: వీ కోటలో విలేకరి జగన్ మోహన్ దారుణ హత్యకు గురయ్యారు. ఇటీవల జరిగిన కొన్ని దొంగతనాలపై ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ హత్య వెనుక అదే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన దొంగతనాలపై ఆయన పోలీసులకు వివరాలు అందించగా, ఆ విషయాన్ని గుర్తించిన దొంగల గుంపు కక్షతో ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం.

April 28, 2026 / 11:33 AM IST

వాహనాలకు మాత్రమే డీజిల్ పట్టాలి: తహసీల్దార్

KDP: వాహనదారులకు మాత్రమే డీజిల్ పట్టాలని తహసీల్దార్ అనురాధ పెట్రోల్ బంకుల యజమానులకు సూచించారు. సింహాద్రిపురంలోని హెచ్‌పి పెట్రోల్ బంకుతో పాటు పలు పెట్రోల్ బంకులను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజిల్ పట్టాలన్నారు. ఆమె వెంట ఆర్ఐ గంగాధర రెడ్డి, వీఆర్వో పుష్పరాజ్, తదితరులు ఉన్నారు.

April 28, 2026 / 11:30 AM IST

జిల్లాలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్

సత్యసాయి: కదిరిలో మే 1న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ తెలిపింది. ఎస్‌టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18-38 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని అధికారులు తెలిపారు.

April 28, 2026 / 11:30 AM IST

కారసాని శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలో మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత క్రాంతి కుమార్ పాల్గొన్నారు.

April 28, 2026 / 11:28 AM IST