• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఇంటిలో ఉన్న పుస్తకాలే ఇంటి విలువను నిర్ణయిస్తాయి’

PPM: ఇల్లు ఎంత పెద్దదని కాదు అందులో ఉన్న పుస్తకాలే ఇంటి విలువను నిర్ణయిస్తాయని పాలకొండకు చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు జనార్దన రావు అన్నారు. మంగళవారం స్దానిక శాఖ గ్రంధాల అధికారి గణేష్ బాబు ఆద్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరం నేటి నుండి జూన్‌ నెల 6 వరకు నిర్వహిస్తామని తెలియజేశారు.

April 28, 2026 / 01:51 PM IST

డేటా సెంటర్ శంకుస్థాపన ఏపీకి గర్వకారణమైన రోజు: ఎమ్మెల్యే

VZM: సీఎం చంద్రబాబు మంగళవారం తర్లువాడలో గూగుల్ సంస్థ రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో AI డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయడం రాష్ట్ర ఐటీ రంగానికి కొత్త దిశను చూపుతోందని MLA అతిది గజపతిరాజు అన్నారు. ఆమె మాట్లాడుతూ.. దీని ద్వారా అపారమైన ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి సాంకేతిక పురోగతి, మరింత అంతర్జాతీయ స్దాయి గుర్తు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

April 28, 2026 / 01:50 PM IST

ప్రజా దర్బార్‌కు విశేష స్పందన

మార్కాపురం పట్టణంలో ఇవాళ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

April 28, 2026 / 01:49 PM IST

వార్డు సభ్యురాలు పెద్ద అంపమ్మ మృతి

KRNL: కోసిగి 3వ వార్డు సభ్యురాలు పెద్ద అంపమ్మ మరణంతో పట్టణంలో విషాదం నెలకొంది. ఆమె భౌతిక కాయానికి మంత్రాలయం టీడీపీ సొసైటీ ఛైర్మన్ ఎన్.రామకృష్ణారెడ్డి ఇవాళ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 28, 2026 / 01:48 PM IST

‘కొరత వెనక ప్రభుత్వం కుట్ర ఉంది’

SKLM: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. 4510 పెట్రోల్ బంకుల్లో 70% నో స్టాక్ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని డీలర్లు ఇంధనాన్ని నిల్వ చేస్తున్నారని, ప్రభుత్వం సమీక్ష చేయకుండా కేవలం లీకులతో కాలయాపనం చేస్తుందన్నారు.

April 28, 2026 / 01:46 PM IST

అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం

VSP: విశాఖ మురళీనగర్ సెక్టార్-11లో ట్రెక్కింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. దివంగత కె. త్రిపురసుందరరావు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమంలో పాదచారులు, కార్మికులకు ప్రతిరోజూ మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నారు. ఈ చలివేంద్రం 50 రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

April 28, 2026 / 01:44 PM IST

‘జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలి’

CTR: వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పుంగనూరు జర్నలిస్టుల యూనియన్ నాయకులు సలీం డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

April 28, 2026 / 01:43 PM IST

విలేకరి దారుణ హత్య.. తిరుపతిలో జర్నలిస్టుల నిరసన

CTR: వీకోట విలేకరి జగన్మోహన్ హత్యను నిరసిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిని వేటకోడవళ్లతో దారుణంగా నరికి చంపారంటూ మండిపడ్డారు. నిందితులను వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించేలా ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

April 28, 2026 / 01:35 PM IST

పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్టు

AKP: కోటవురట్ల మండలం గొట్టివాడలో పేకాట శిబిరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.2,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 28, 2026 / 01:35 PM IST

ప్యాపిలిలో నీటి ఎద్దడి.. అధికారులపై అసహనం..!

NDL: ప్యాపిలి పట్టణంలో గత ఎనిమిది రోజులుగా తీవ్రమైన నీటి కష్టాలు నెలకొన్నాయి. ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేసేందుకు ప్రజలు రూ.300–రూ.700 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీటి పన్ను వసూలు చేసే సమయంలో వచ్చే అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

April 28, 2026 / 01:33 PM IST

కాలువ పూడికతీతపై కమిషనర్ ఫోకస్

GNTR: మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు 30వ వార్డులో కాలువ పూడికతీత పనులను పరిశీలించారు. సిల్ట్ పూర్తిగా తొలగించి వెంటనే తరలించాలని సూచించారు. కాలువల్లో చెత్త వేయొద్దని హెచ్చరించారు. 34వ వార్డులో గృహనిర్మాణ కేంద్రం, వీఎస్ఆర్-ఎన్వీఆర్ కాలేజీ సమీపంలోని నీటి సరఫరా కేంద్రాన్ని తనిఖీ చేసి నాణ్యతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

April 28, 2026 / 01:23 PM IST

ప్రత్యేక అలంకారంలో శ్రీవిరుపాక్షి మారెమ్మ దర్శనం

CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపాన గల శ్రీవిరుపాక్షి మారమ్మ మంగళవారం విశేష పూజలు అందుకున్నారు. ఉదయపూర్వమే అర్చకులు అమ్మవారి మూల విగ్రహాన్ని క్షీరాలతో పాటుసుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత కుంకుమ, పసుపు, గంధం, కాటుక, వెండి, ఆభరణాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు మారెమ్మను దర్శించుకున్నారు.

April 28, 2026 / 01:19 PM IST

రాజానగరంలో రూ.3.5 కోట్ల రోడ్లకు శంకుస్థాపన

తూ.గో: రాజానగరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మంగళవారం సీతారాంపురంలో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

April 28, 2026 / 01:18 PM IST

అమ్మవారి సేవలో ఎమ్మెల్యే

SKLM: అరసవల్లి గ్రామ దేవత అసిరితల్లి పండుగలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం కమిటీ సభ్యుల ఆహ్వానం మెరకు ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC చైర్మన్ కూన రవికుమార్ హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజల మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

April 28, 2026 / 01:18 PM IST

TTD కల్తీ నెయ్యి కేసు.. ACB కోర్టులో కీలక పరిణామం

TPT: TTD కల్తీ నెయ్యి కేసులో నెల్లూరు ACB కోర్టు 36 మందిపై దాఖలైన ఛార్జ్ షీట్లను స్వీకరించింది. మొదటి విడతలో 14 మందిని, రెండో విడతలో మిగిలిన వారిని విచారించనుంది. 3 డైరీ సంస్థల యజమానులు, TTD ఉద్యోగులు విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో బోలెబాబా, వైష్ణవి, AR డెయిరీ సంస్థలపై కమీషన్ల కోసం TTDకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

April 28, 2026 / 01:15 PM IST