• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కొత్తపోలమ్మ ఉత్సవాలకు ఎమ్మెల్యే

PPM: ఈ నెల 26 నుంచి 29 వరకు కొత్తవలసలో శ్రీ కొత్త పోలమ్మ అమ్మవారి పండగ నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇవాళ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పండగలో చేపట్టనున్న ఘటాల ఊరేగింపునకు రావాలంటూ స్థానిక MLA బోనెల విజయచంద్రను ఆయన కార్యాలయంలో కలసిన ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేసారు.

April 22, 2026 / 12:06 PM IST

గ్రామీణ యువతులకు ఉచిత నైపుణ్య శిక్షణ

సత్యసాయి: పుట్టపర్తిలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో యువతులకు బ్యూటీ పార్లర్, కుట్టు పనిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శాంతిప్రియ తెలిపారు. మే 6 ప్రారంభమయ్యే ఈ 35 రోజుల కోర్సులో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తిగల వారు 97105091727, 9391486269 నంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.

April 22, 2026 / 12:06 PM IST

పుల్లలరేవులో కొత్త రహదారుల ప్రారంభం

ATP: రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పుల్లలరేవు గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. రూ.50 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. అలాగే గొందిరెడ్డిపల్లి నుంచి పుల్లలరేవు వరకు రూ.1.30 కోట్ల ఏపీఆర్‌ఆర్‌పీ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయని ఆమె తెలిపారు.

April 22, 2026 / 12:02 PM IST

ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యం

AKP: ప్రజలకు మెరుగైన పాలన, అత్యుత్తమ సేవలు అందించే లక్ష్యంతో సింగపూర్ లో పర్యటిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రెండవ రోజు సింగపూర్ హోం మమంత్రి షణ్ముగంతో సమావేశమై శాంతిభద్రతల నిర్వహణ, చట్టాలు అమలుపై చర్చించడం జరిగిందని అన్నారు. పట్టణ ప్రణాళికలు, భూపాలనపై శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. ఆ దేశ 50 ఏళ్ల ప్రగతిని అధ్యాయం చేస్తున్నట్లు చెప్పారు.

April 22, 2026 / 12:01 PM IST

చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు వహించాలి: డాక్టర్

CTR: వేసవిలో ఎండ తీవ్రతతో చిన్నపిల్లలకు డీహైడ్రేషన్ అలసట, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పుంగనూరు ప్రభుత్వ హాస్పిటల్ చిన్న పిల్లల డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. బుధవారం అయన మాట్లాడుతూ.. పిల్లలకు దాహం వేయకపోయినా తరచూ మంచి నీరు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, లేదా పండ్ల రసాలు ఇస్తుండాలన్నారు. జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని సూచించారు.

April 22, 2026 / 12:01 PM IST

‘నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలి’

ELR: చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. బుధవారం చింతలపూడి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను పలు మండలాలకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఆర్థికేతరమైన అంశాలు ఉంటే తక్షణమే పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

April 22, 2026 / 11:58 AM IST

‘వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు’

KDP: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 24 నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని మండల విద్యాశాఖ అధికారి నాగ స్వర్ణ లత బుధవారం తెలిపారు. ప్రత్యేక తరగతుల పేరుతో తరగతులు నిర్వహించిన, అడ్మిషన్లు ప్రారంభించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

April 22, 2026 / 11:53 AM IST

‘ఆదోనిలో మేక వంక ఆక్రమణ తొలగించాలి’

కర్నూలు: ఆదోని సమీపంలో మేక వంక ఆక్రమణపై ఇవాళ MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆలూరు రోడ్ నూతన బైపాస్ వద్ద చట్టవిరుద్ధంగా నిర్మించిన సిమెంట్ కాలువ తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే సర్వే చేసి ఆక్రమణలు తొలగించి వంకను పునరుద్ధరించాలని కోరారు. లేకపోతే ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

April 22, 2026 / 11:40 AM IST

మల్టీకుషన్ రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: అరకులోయకు ముఖద్వారంగా ఉన్న బొడ్డవర పంచాయతీ పరిధిలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త అడుగు పడింది. రోహిత్ వెంకట సాయి కంచర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంసీఆర్ మల్టీ కుషన్ హెలికాప్టర్ రెస్టారెంట్‌ను స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇవాళ ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇలాంటి వినూత్న ప్రయత్నాలు ఎంతో అవసరమన్నారు.

April 22, 2026 / 11:39 AM IST

ఏప్రిల్ 30 నుంచి ఎల్లమాంబ తిరుణాళ్లు

KDP: సిద్ధవటం మండలం మాచుపల్లిలో వెలిసిన శ్రీ జగజ్జనని రేణుక యల్లమాంబ తిరుణాల ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా.. అమ్మవారికి పలు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

April 22, 2026 / 11:37 AM IST

‘రహదారి సమస్యను పరిష్కరించాలి’

CTR: పాలసముద్రం మండలంలోని వెంగళరాజు కుప్పం గ్రామంలో గతంలో ఇచ్చిన డీకేటీ భూములకు, కనికలమ్మ ఆలయానికి వెళ్లే రహదారిని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించి గేట్ వేశారని బాధితులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ రహదారి సర్వే చేయించి న్యాయం చేయాలని రెవిన్యూ అధికారులు విన్నవించినా పట్టించుకోవడంలేదని వాపోయారు. సర్వేయర్లు అందుబాటులో లేక సమస్య అలాగే ఉందన్నారు.

April 22, 2026 / 11:32 AM IST

హార్సిలీ హిల్స్‌లో పర్యాటకుల తగ్గుముఖం

అన్నమయ్య: ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ నిర్మానుష్యంగా మారింది. ఎండలు విపరీతంగా పెరగడం, కొండపై కూడా చల్లదనం లేకపోవడంతో సందర్శకుల రాక తగ్గిపోయింది. ఏసీ గదులను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో పర్యాటకులు ఆసక్తి చూపడం లేదు. మంగళవారం కొండపై 37°C ఉష్ణోగ్రత నమోదై, సాయంత్రానికి 35°Cకు తగ్గింది. దీంతో పర్యాటకుల సంచారం లేక కొండ బోసిపోయింది.

April 22, 2026 / 11:25 AM IST

ఖైదీ పరారీ విషయంలో కీలక విషయాలు

గుంటూరు: జీజీహెచ్‌ నుంచి ఖైదీ అజిత్ పరారీ ఘటనలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆసుపత్రికి వెళ్లేందుకు రేపల్లె జైలర్‌కు ఖైదీ సోదరి రూ.60వేలు లంచం ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఆసుపత్రిలో ఎస్కార్ట్ కానిస్టేబుల్‌కు రూ.500 ఇచ్చి టిఫిన్‌కు పంపి అతడు పారిపోయాడు. ఈ వ్యవహారంలో లంచం తీసుకున్న జైలర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

April 22, 2026 / 11:24 AM IST

గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం

KDP: ఎండాకాలం ప్రభావం, ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 22.228 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ ఉమా మహేశ్వర్లు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గండికోట ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 26.85 టీఎంసీలు ఉంటుంది.

April 22, 2026 / 11:21 AM IST

కడపలో ఆధ్యాత్మిక ఉత్సవాలకు ముహూర్తం ఖరారు

కడపలో తిరుమల తొలి గడపలో ఈ నెల 29 నుంచి మే 1 వరకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం స్వామివారు దేవేరులతో కలిసి పుష్కరిణిలో తెప్పపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

April 22, 2026 / 11:12 AM IST