• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమ్మ వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

NTR: పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా రూ. 500 దర్శన టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి, బంగారు వాకిలి ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. ఘాట్ రోడ్, కనకదుర్గానగర్ వైపు వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

May 31, 2026 / 12:10 PM IST

గండి దేవస్థానం ఈవోగా విశ్వనాథ్

కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయ స్వామి దేవాలయం ఈవోగా విశ్వనాథ్ నియమితులయ్యారు. అన్నమయ్య జిల్లా ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న విశ్వనాథ్కు గండి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం గండి ఈవోగా బాధ్యతలు చూస్తున్న కర్నూల్ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ నేడు రిటైడ్ అవుతున్నారు.

May 31, 2026 / 12:10 PM IST

నీటి కొరతతో అల్లాడుతున్న గ్రామాలు

మన్యం: గుమ్మలక్ష్మీపురం మండలం స్తంభంగూడ గ్రామంలో తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి నీరు అందిస్తున్న సోలార్ వాటర్ ట్యాంక్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో సరిపడా నీటి సరఫరా జరగడం లేదని స్థానికులు వాపోతున్నారు. పరిసర గ్రామాల ప్రజలు కూడా ఇదే ట్యాంక్‌పై ఆధారపడటంతో సమస్య మరింత తీవ్రమైందని, దీంతో బోర్లు, బావులపై ఆధారపడుతున్నాం అని వాపోతున్నారు.

May 31, 2026 / 12:07 PM IST

బైక్‌ను ఢీ కొట్టిన కారు.. తీవ్ర గాయాలు

TPT: పెళ్లకూరు మండలం చెంబడపాలెం వద్ద ఆదివారం ఉదయం 7.20 గంటలకు శ్రీ కాళహస్తి నుంచి నాయుడుపేట వైపు వెళ్లే బైక్‌ను వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది కాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

May 31, 2026 / 12:05 PM IST

ఎండాడ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

విశాఖలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో జూ వైపు వస్తున్న ఓ ఆటో ఎండాడ జంక్షన్ వద్ద కుడివైపు మలుపు తిరుగుతున్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

May 31, 2026 / 11:46 AM IST

రిజర్వేషన్‌ల తీర్మానంతో హర్షం వ్యక్తం చేసిన మహిళలు

WG: ఇటీవల జరిగిన తెలుగుదేశం మహానాడు తీర్మానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలను ఎప్పుడూ గౌరవించే ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు రాష్ట్రంలోని ఉన్న మహిళలు అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.

May 31, 2026 / 11:40 AM IST

మత్తు రహిత సమాజమే లక్ష్యం: ఎస్పీ

అన్నమయ్య: మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో శనివారం ‘డ్రగ్ డిటెక్షన్’ కిట్లతో అనుమానితులపై తనిఖీలు నిర్వహించగా.. పరీక్షల్లో అందరికీ నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం ఉంటే 112 లేదా ఈగల్ సెల్ 1972కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

May 31, 2026 / 11:34 AM IST

టీడీపీ పార్లమెంట్ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన

ప్రకాశం: ఒంగోలులో నూతనంగా నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయ నిర్మాణ పనులను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్మాణ పురోగతిని పరిశీలించి, పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత నాయకులు, నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

May 31, 2026 / 11:31 AM IST

‘వారిపై చర్యలు తీసుకోండి’

ELR: జంగారెడ్డిగూడెం శివారు పెరంపేట రోడ్డులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను యథేచ్ఛగా పారబోస్తున్నారు. దీంతో వెలువడుతున్న తీవ్ర దుర్వాసన వల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అటువైపుగా వెళ్లలేని విధంగా పరిస్థితులు ఉండటంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యర్థాలను పారబోస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

May 31, 2026 / 11:29 AM IST

టీవీ వద్దు-పుస్తకం ముద్దుపై అవగాహన కార్యక్రమం

BPT: సంతమాగులూరు శాఖా గ్రంధాలయం నందు ఆదివారం 27వ రోజు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం జరిగినది. ఈ మేరకు విద్యుత్ శాఖ లైన్మెన్ ఎస్. హరి గోపాల్ “టీవీ వద్దు-పుస్తకం ముద్దు” అనే కాన్సెప్ట్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల ఆటలు ఆడటం జరిగినది. ఈ కార్యక్రమంలో 17 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

May 31, 2026 / 11:26 AM IST

వీర బ్రహ్మేంద్ర స్వామి నివాస పునర్నిర్మాణం ఎప్పుడో..?

KDP: వీర బ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న ఇళ్లు గత వర్షాకాలంలో కూలిన విషయం తెలిసిందే. అప్పుడు SM ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ వెంటనే స్వామి నివాస గృహాన్ని పునర్నిర్మించాలని కలెక్టరుకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పటికి దాదాపు 8 నెలలు అవుతున్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టక పోవటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

May 31, 2026 / 11:23 AM IST

శ్రీ అసిరితల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SKLM: జి.సిగడాం, రణస్థలం మండలంలో శ్రీ అసిరితల్లి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

May 31, 2026 / 11:21 AM IST

బాడీ బిల్డింగ్‌లో తాడిపత్రి యువకుడి ప్రతిభ

ATP: బెంగళూరులో ఐ కంప్లీట్ నాచురల్ సంస్థ నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల బాడీ బిల్డింగ్ పోటీలలో తాడిపత్రికి చెందిన సాయి మూడవ స్థానం సాధించారు. మొత్తం 143 మంది పాల్గొన్న ఈ పోటీలలో సాయి అద్భుత ప్రతిభ కనబరిచారు. సాయి విజయం పట్ల తాడిపత్రి ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మరింత రాణించాలని ఆకాంక్షించారు.

May 31, 2026 / 11:20 AM IST

బొమ్మవారంలో భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ తిరునాళ్లు

NLR: అనంతసాగర్ మండలంలోని బొమ్మ వారంలో వెలసి ఉన్న గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి తిరునాళ్లు ఆదివారం వైభవంగా జరిగాయి. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తోలుత అమ్మవారికి భక్తులు పొంగళ్లు పొంగించి నైవేద్యం అందించారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

May 31, 2026 / 11:20 AM IST

ధ్వంసమైన YSR విగ్రహాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ

NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా సంఘటన స్థలానికి చేరుకొని ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తన అనుచరులతో కలిసి నిరసన చేపట్టారు.

May 31, 2026 / 11:19 AM IST