• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు బోగేశ్వరస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం

NDL: గడిగరేవుల గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా బోగేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్యాంసుందర్ శర్మ తెలిపారు. ఆదివారం సాయంత్రం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు వివిధ రకాల ద్రవ్యాలతో దాతల ఆధ్వర్యంలో మంగళ స్నానం, రుద్రాభిషేక పూజలు వైభవంగా జరిపారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు హాజరు కావాలన్నారు.

April 26, 2026 / 08:39 PM IST

కరెంట్ షాక్‌తో కొబ్బరి కార్మికుడు మృతి

కోనసీమ: అమలాపురం మండలం వేమవరప్పాడు గ్రామంలో మానుపాటి గోవింద అనే కొబ్బరి కార్మికుడు కొబ్బరికాయలు దింపు పనిలో ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్టుపై కొబ్బరికాయలు దింపుతున్న సమయంలో కొబ్బరాకు అడ్డుగా ఉండటంతో దానిని తొలగించే ప్రయత్నంలో గోవింద విద్యుత్ తీగలను తాకాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

April 26, 2026 / 08:29 PM IST

రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీవో

NTR: విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామంలోని రైస్ మిల్లును ఆర్డీవో ఏ.కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం దిగుమతుల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. మిల్లులో ఏర్పాట్లు, కొనుగోలు విధానంపై వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కే.లక్ష్మీ కళ్యాణి పాల్గొన్నారు.

April 26, 2026 / 08:25 PM IST

పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైక్ మాయం

KRNL: ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన అవెంజర్ బైక్ కనిపించకుండా పోవడం కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన సోమశంకర్ జరిమానా చెల్లించినప్పటికీ బైక్ ఇవ్వలేదని ఇవాళ ఆరోపించాడు. ఏడు నెలల తర్వాత స్టేషన్‌కు వెళ్లగా బైక్ మాయం అయినట్టు తెలిసి షాక్‌కు గురయ్యాడు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, ఆయన తల్లి డిమాండ్ చేశారు.

April 26, 2026 / 08:25 PM IST

పి4 పథకం కింద చేపల మార్కెట్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: యనమలకుదురులో పి4 పథకం కింద చేపల మార్కెట్‌ను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు Y. V. B. రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. పేద వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక భరోసా అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. పి4 పథకం సామాజిక ఆర్థిక అసమానతలు తగ్గించడంలో దోహదపడుతుందన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 26, 2026 / 08:24 PM IST

వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: హేమాద్రి

KDP: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి పార్టీ మారడంపై వైసీపీ నాయకుడు హేమాద్రి రెడ్డి స్పందించారు. ఆదివారం వేములలో ఆయన మాట్లాడుతూ.. సతీశ్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారలేదని, కారణాలు చెప్పి మారారని తెలిపారు. భూపేశ్ రెడ్డి, ఇతర నాయకులు మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ మారారని హేమాద్రి రెడ్డి ఆరోపించారు.

April 26, 2026 / 08:22 PM IST

అన్ని బంకుల్లో డీజిల్ అందుబాటులో ఉంది: జేసీ

WG: భీమవరం జిల్లా కలెక్టరేట్లో చేసి రాహుల్ కుమార్ రెడ్డి ఆయన కార్యాలయంలో డీజిల్ పై మీడియా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. జిల్లాలో అన్ని బంకుల్లో డీజిల్ అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నామని ముఖ్యంగా రైతులకు కూపన్ విధానంలో డీజిల్ అందిస్తున్నామని అన్నారు. పోలీస్, సివిల్ సప్లై, అన్ని శాఖలు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు.

April 26, 2026 / 08:18 PM IST

ఘనంగా బ్రహ్మంగారి జయంతి వేడుకలు

GNTR: తెనాలి గాంధీ చౌక్‌లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

April 26, 2026 / 08:14 PM IST

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, శిశువు సురక్షితం

ASR: డుంబ్రిగూడ మండలం జోగిపుట్టు గ్రామానికి చెందిన కోర్రా బ్రుందకు ఆదివారం ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో 108అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో ప్రసవం జరిగి ఆడ శిశువు జన్మించింది. తల్లి, శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని EMT ఏ. అప్పలనాయుడు తెలిపారు.

April 26, 2026 / 08:14 PM IST

యువత క్రీడల్లో రాణించాలి: భూపేశ్ రెడ్డి

KDP: యువత క్రీడల్లో రాణించాలని TDP జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. కొన్ని రోజులుగా ఎర్రగుంట్ల (M) వై. కోడూరులో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఇందులో విజేతగా నిలిచిన Kcc11 టీంకు రూ.1.50 లక్షలు,రన్నరుగా నిలిచిన ఫ్రెండ్స్ 11 టీంకు రూ. 75 వేల నగదును భూపేశ్ బహుమతిగా అందించారు. నేటి ఓటమి రేపటికి గెలుపునకు నాంది అని క్రీడాకారులకు ఆయన సూచించారు.

April 26, 2026 / 08:13 PM IST

సన్నిధి వీధిలో ఫ్లెక్సీల వివాదం

TPT: నాగలాపురంలోని వేద నారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల వేళ సన్నిధి వీధిలో రాజకీయ ఫ్లెక్సీలు విస్తరించడం వివాదాస్పదమైంది. దర్శన మార్గంగా ఉండాల్సిన వీధి పార్టీ బ్యానర్లు, బోర్డులతో నిండిపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

April 26, 2026 / 08:02 PM IST

వాసవి జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

KRNL: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వాసవి మాత శాంతి, సేవా భావానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 26, 2026 / 08:02 PM IST

చోరీ జరిగిన ఇంట్లో వేలిముద్రల సేకరణ

ATP: గుత్తిలోని ఓల్డ్ సీపీఐ కాలనీలో నివాసముండే షాహినా అనే మహిళ ఇంట్లో శనివారం రాత్రి 4 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం జిల్లా క్లూస్ టీం సభ్యులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. కిటికీలు, డోర్లపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. పరిసరాలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.

April 26, 2026 / 08:00 PM IST

‘అనంతబాబును తక్షణమే బర్తరఫ్ చేయాలి’

KRNL: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే బర్తరాఫ్ చేయాలని ఆదివారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ధరూర్ జేమ్స్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

April 26, 2026 / 07:49 PM IST

క్రికెట్ బెట్టింగ్‌పై రైడ్.. ముగ్గురు అరెస్ట్

GNTR: నగరంపాలెం పీఎస్ పరిధిలోని సత్తెనపల్లి రోడ్డులో విజయలక్ష్మి బార్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఖాతాల్లో రూ.3,748 ఉన్నట్లు గుర్తించారు. తదుపరి విచారణకు కేసును నగరంపాలెం పోలీసులకు అప్పగించామన్నారు.

April 26, 2026 / 07:43 PM IST