• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సూర్యలంక అభివృద్ధి పనుల పరిశీలన

బాపట్ల: ఎంపీ కృష్ణప్రసాద్ సూర్యలంకలో పర్యటించారు. అధికారులతో కలిసి మంగళవారం అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.97.52 కోట్లతో సూర్యలంక తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణాల్లో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. పర్యాటకులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు.

April 7, 2026 / 12:26 PM IST

రేపు రేవుల లీజ్ వేలం.. ముందస్తు టెండర్ తప్పనిసరి..!

గుంటూరు జడ్పీ కార్యాలయంలో రేవుల లీజ్ హక్కుల కోసం బుధవారం వేలం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సీల్ టెండర్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2:30కి బహిరంగ వేలం జరుగుతుంది. టెండర్ దాఖలు చేసిన వారికే పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరన్నారు. అధికారులు తీసుకునే నిర్ణయం తుది నిర్ణయమని వెల్లడించారు.

April 7, 2026 / 12:20 PM IST

‘ఖాజీపేటలో రేపు మండల సర్వసభ్య సమావేశం’

KDP: ఖాజీపేటలోని ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో రేపు మండల సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో దివిజ సంపతి ఇవాళ తెలిపారు. ఈ సమావేశ కార్యక్రమానికి ప్రభుత్వ శాఖల అధికారులు అందరూ తమ పూర్తి నివేదికలతో సమావేశానికి తప్పక రావలసి ఉంటుందన్నారు. ఎంపీటీసీ సభ్యులు, ప్రత్యేక అధికారులు తప్పక హాజరు కావాలన్నారు.

April 7, 2026 / 12:11 PM IST

కాలువ నీరే తాగునీరు.. గ్రామస్తుల దుస్థితి

ASR: పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ ఎర్రబయలు గ్రామంలో గిరిజనులు 2019 నుంచి తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాగునీటి కాలువలలోని కలుషిత నీటిని తాగుతూ అనారోగ్యాలకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బోర్‌వెల్ మంజూరు చేసినప్పటికీ RWS అధికారులు పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

April 7, 2026 / 12:05 PM IST

మండలంలో పంట నష్టపోయిన వారికి పరిహారం

CTR: ఏనుగు దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, డీఎఫ్‌వో సుబ్బరాజుతో కలిసి పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. మంగళవారం గుడిపాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 30 మంది రైతులకు రూ.2.76 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

April 7, 2026 / 12:05 PM IST

ఉపాధి హామీ పథకంపై సామాజక తనిఖీలు నిర్వహించిన ఏపీడీ

PPM: కురుపాం MPDO కార్యాలయం వద్ద APD శ్రీహరి ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాదిలో నిర్వహించిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఉపాధి పనుల అమలు, నిధుల వినియోగం, కార్మికులకు చెల్లింపులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో చేపట్టిన పనుల నాణ్యత, పనిదినాల నమోదు, మస్టర్‌ రోల్స్‌, కార్మికులకు అందిన వేతనాల వివరాలను పరిశీలించారు.

April 7, 2026 / 12:00 PM IST

క్రోసూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

PLD: క్రోసూరు మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 14 మందికి రూ.1,07,45,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య రక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో దోహదపడుతోందన్నారు.

April 7, 2026 / 11:58 AM IST

గ్రామాల్లో అధ్వాన్నంగా పారిశుద్ధ్యం

KDP: లింగాల మండలం దిగువపల్లె, కోమన్నూతల గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. గ్రామాల ప్రధాన రహదారుల రోడ్లకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీ కాలువలో చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో రోడ్లపై మురుగునీరు ఉంటోంది. గ్రామాల్లో దుర్గంధం వెదజల్లడంతో నిల్వ చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రీన్ అంబాసిడర్లు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు.

April 7, 2026 / 11:55 AM IST

వెల్దుర్తిలో కార్మిక సంఘం వినతిపత్రం

KRNL: వెల్దుర్తిలో ఎన్ఆర్ఐ డైరెక్టర్ షణ్‌ముఖ్‌కు సీపీఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఇవాళ నేతలు వినతిపత్రం అందజేశారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, విబి-జిరామ్ జి బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు ఏడాదికి 200 పని దినాలు, రోజుకు రూ.800 కూలి ఇవ్వాలని కోరారు. ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని సూచించారు.

April 7, 2026 / 11:53 AM IST

‘శారీరక వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’

VZM: ప్రపంచ ఆరోగ్య దినోత్సోవం సందర్భంగా ఇవాళ స్దానిక 42వ డివిజన్‌ అయ్యన్నపేట మున్సిపల్‌ నడక మైదానంలో ఆంజనీపుత్ర చిరంజీవి వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ డా.డివిజి శంకర‌రావు మాట్లాడుతూ.. రోజు నడక, యోగ, తదితర శారీరక వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని స్థానికులకు సూచించారు.

April 7, 2026 / 11:45 AM IST

భక్తులకు గుడ్ న్యూస్.. RTC ప్రత్యేక సర్వీస్

కోనసీమ: భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ రావులపాలెం డిపో నుంచి కర్ణాటక, మైసూర్ ఎనిమిది రోజుల పుణ్యక్షేత్ర యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వై.వి.వి.ఎన్. కుమార్ తెలిపారు. ఈ బస్సు ఈ నెల 25వ తేదీ మధ్యాహం రావులపాలెం నుంచి బయలుదేరుతుందన్నారు. ఈ సూపర్ లగ్జరీ బస్సుకు అడ్వాన్స్ రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

April 7, 2026 / 11:44 AM IST

వలసపాకలలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

కాకినాడ రూరల్ వలసపాకలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం స్థానికులు పట్టుకున్నారు. పట్టపగలే పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నా పౌరసరఫరాల శాఖ పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వారే వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సర్పవరం పోలీసులు వాహనాన్ని స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 7, 2026 / 11:44 AM IST

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ

ELR: చింతలపూడి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. ప్రజారోగ్య పరిరక్షణకు అందరూ సమిష్టిగా పనిచేయాలని, సామాజిక బాధ్యతతో పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వంలో PHCల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

April 7, 2026 / 11:43 AM IST

కాకినాడలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

KKD: కాకినాడ కమిషనర్ ఎన్.వి.వి సత్య నారాయణ మంగళవారం కచేరిపేట, వేంకటేశ్వరనగర్, పాత బస్టాండ్ ప్రాంతాలలో పర్యటించారు. పారిశుద్ధ్యం పనులను తనిఖీ చేసిన ఆయన, కార్మికుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. శానిటేషన్ విషయంలో రాజీ పడవద్దని సిబ్బందిని ఆదేశించారు. స్థానికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.

April 7, 2026 / 11:42 AM IST

ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహణ

KRNL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని అధికారి కామేశ్వర్ ప్రసాద్ ప్రారంభించారు. యోగా, వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

April 7, 2026 / 11:40 AM IST