• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పాడేరులో కూలిపోవడానికి సిద్ధంగా విద్యుత్ స్తంభాలు

ASR: పాడేరు మండలం నీకాయిపాడులో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇనుప విద్యుత్ స్తంబాలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గ్రామంలో ఐదు స్తంభాలు ప్రమాదకర స్థితిలో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశముందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు స్పందించి నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

April 9, 2026 / 06:41 AM IST

ఏలేరు రిజర్వాయర్‌లో మృతదేహం లభ్యం

KKD: ఏలేరు రిజర్వాయర్ పవర్ ప్లాంట్ బిట్-2 సమీపంలో బుధవారం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మత్స్యకారుల సమాచారంతో మత్స్య శాఖ అధికారి రాజేంద్రరావు బోట్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడు జడ్డంగి అన్నవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా ఎస్సై రామలింగేశ్వరరావు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

April 9, 2026 / 06:39 AM IST

శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు సర్వీసు

శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీసు మంజూరైనట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రకటనల్లో తెలిపారు. హమ్సఫర్ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుందని రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం రోడ్ నుంచొ ప్రయాణిస్తుందన్నారు.

April 9, 2026 / 06:28 AM IST

నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సుబాష్

SKLM: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మంత్రి సుభాష్ గురువారం ఉ.10.30కు ఎచ్చెర్లలోని NACL కంపెనీలో సేఫ్టీ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రెడ్డీస్ లాబరేటరీలో జరిగే మాక్ డ్రిల్‌ను సందర్శిస్తారు. అనంతరం సా. 3 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని తెలిపారు.

April 9, 2026 / 06:25 AM IST

నేటి నుంచి యథావిధిగా మంచినీటి సరఫరా: కమిషనర్

VZM: రాజాం పట్టణంలో గురువారం నుంచి యథావిధిగా కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్‌ రామచంద్రరావు బుధవారం తెలిపారు.ఆయన మాట్లాడుతూ.. రేగిడి మండలం మజ్జి రాముడు పేట వద్ద ప్రధాన పైపులైను మరమ్మతు పనులు పూర్తై నేపథ్యంలో యథావిధిగా నీటిని పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రజలను కోరారు.

April 9, 2026 / 06:14 AM IST

డీసెట్-2026 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

W.G: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీసెట్-2026 ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనట్లు దూబచర్ల డైట్ కాలేజీ ప్రిన్సిపల్ కమలకుమారి తెలిపారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ కోర్సులో చేరాలనుకునే వారు 7995869743 నంబరులో సంప్రదించాలని కోరారు.

April 9, 2026 / 06:12 AM IST

నాయుడుపేటలో అక్రమంగా కలప తరలింపు

TPT: నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసపురం సోషల్ ఫారెస్ట్ భూముల్లో నీలగిరి తైలం చెట్లను కొందరు వ్యక్తులు అక్రమంగా నరికి తరలిస్తున్నారు. టన్నుల పరిమాణంలో కలపను తరలిస్తున్నప్పటికీ, రెవెన్యూ, ఫారెస్ట్, మున్సిపాలిటీ అధికారులు ఈ అక్రమాన్ని పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

April 9, 2026 / 06:11 AM IST

మూల్యాంకనంలో తప్పులు దొర్లితే కఠిన చర్యలు: కలెక్టర్

EG: బాల విజ్ఞాన్ మందిర్ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, అధికారులకు అందుతున్న వసతులపై డీఈవో వాసుదేవరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పాట్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. 

April 9, 2026 / 06:11 AM IST

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఎమ్మెల్యే

ATP: పుట్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

April 9, 2026 / 06:10 AM IST

తాగునీటి కష్టాలు.. ఇబ్బందుల్లో ప్రజలు

CTR: వేసవి ప్రారంభమవ్వడంతో పల్లెల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పలమనేరు రూరల్ జరావారి పల్లి, పకీరుపల్లి, పి. వడ్డూరులో బోరు మోటార్లు పనిచేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి నీరు తెచ్చుకుంటున్నామన్నారు. ఆరు నెలల నుంచి చెబుతున్నా ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

April 9, 2026 / 06:10 AM IST

28న గడివేములలో రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్

NDL: గడివేముల మండలం శ్రీ పేట లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం పురస్కరించుకుని ఈ నెల 28న రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన జట్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజేతలకు రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు అందజేయనున్నారు.

April 9, 2026 / 06:05 AM IST

అర్ధరాత్రి బస్సుల తనిఖీలు.. ఉల్లంఘనలపై కఠిన చర్యలు

గుంటూరు: మంగళగిరి ఖాజా టోల్ ప్లాజా వద్ద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. 20కి పైగా బస్సులు చెక్ చేసి, నిబంధనలు పాటించని ఒక బస్సును సీజ్ చేశారు. 15 బస్సులపై జరిమానాలు విధించారు. ప్రయాణికుల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 9, 2026 / 06:01 AM IST

అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లు పట్టివేత

ప్రకాశం: తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని గోదాంలో అక్రమంగా నిలువ ఉంచిన 21 సిలిండర్ లను ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. రాబడి సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు డొమెస్టిక్ సిలిండర్లు 15, కమర్షియల్ సిలిండర్లు 6 స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిలువ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

April 9, 2026 / 06:00 AM IST

115 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

KRNL: కర్నూలులోని వాణిజ్య సముదాయాలపై అధికారులు బుధవారం దాడులు చేశారు. నగరవ్యాప్తంగా 156 వాణిజ్య సంస్థలను తనిఖీ చేసిన అధికారులు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపట్టారు. అక్రమంగా ఉపయోగిస్తున్న 115 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యాపారులపై 103 సెక్షన్ 6ఏ కింద కేసులు నమోదు చేశారు.

April 9, 2026 / 06:00 AM IST

కడపలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల కఠిన చర్యలు

KDP: జిల్లాలో ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 253 కేసులు నమోదు చేసి, రూ.57,195 జరిమానాలు విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై ప్రత్యేకంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 9, 2026 / 05:17 AM IST