PLD: బెల్టు షాపుల నిర్వహణ వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, గ్రామాలలో బెల్ట్ షాపులు అరికట్టాలని పోలీస్ శాఖకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచించారు. నిన్న కొత్తపల్లిలో ఆయన మాట్లాడుతూ.. మద్యానికి బానిసై యువత చెడుదోవ పడుతున్నారన్నారు. యువతకు ప్రత్యేక అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాలపై చెడు వ్యసనాలపై జరిగే నష్టాన్ని వారికి వివరించాలని అధికారులకు ఆదేశించారు.
KDP: నేడు MLA మాధవి రెడ్డి, TDP నేత శ్రీనివాస రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 06:00 గంటలకు కలెక్టరేట్ నుంచి సెవెన్ రోడ్స్ వరకు జరిగే 5K అవగాహన రన్‌లో పాల్గొంటారు. ఉదయం 10:00 గంటలకు ఏషియన్ జనని హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం 12:00 గంటలకు ఆచార్ల కాలనీలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.
E.G: రాజమండ్రి మార్కెట్‌లో చికెన్ ధరలు ఆదివారం తగ్గుముఖం పట్టాయి. గత వారంతో పోలిస్తే ధరలు దిగిరావడంతో మాంసం దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.230, స్కిన్‌తో రూ.210, లైవ్ కోడి రూ.130కి విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.1000 పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని వ్యాపారస్థులు తెలిపారు.
KKD: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన పలువురు శనివారం రాత్రి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరారు. గ్రామ టీడీపీ నాయకులు జ్యోతుల పెద్దబాబు, పెంటకోట శ్రీధర్, నూకతాటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో పెదశంకర్లపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
సత్యసాయి: కదిరిలో ఆదివారం ఉదయం ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ నిర్వహించారు. డీఎస్పీ శివ నారాయణస్వామి పర్యవేక్షణలో యర్రగుంటపల్లి, కుమ్మరోళ్లపల్లి ప్రాంతాల్లో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ చేపట్టారు. గంజాయి, మట్కా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా ఉంచి 12 వాహనాలను తనిఖీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని సీఐ నారాయణరెడ్డి సూచించారు.
NTR: జిల్లాలో నాన్‌వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ మటన్ రూ. 900, కేజీ చికెన్ స్కిన్‌లెస్ రూ. 230 పలుకుతోంది. ఇక 30 కోడి గుడ్ల ధర రూ. 162గా ఉంది. గుడ్ల ధరలు పెరగడంతో ఆదివారం అవి కూడా ‘మెనూ’ భాగమయ్యాయి. ధరలు భారీగా ఉండటంతో వినియోగదారులు మార్కెట్ల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
సత్యసాయి: వేసవి సెలవుల నేపథ్యంలో పుట్టపర్తి RTC బస్టాండ్ విద్యార్థులు, ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు భారీగా తరలివచ్చారు. దీంతో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
NDL: డోన్ పట్టణంలోని న్యూ మహాలక్ష్మి హాస్పిటల్ పక్కన ఏర్పాటు చేసిన “సోనో స్కాన్స్” కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు YCP యువనేత బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని పార్టీ కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు.
ATP: గార్లదిన్నె మండలం యర్రగుంట్లలో ఆదివారం వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాల సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆరుపల్ల ఒంగోలు జాతి ఎద్దులకు రాతిదూలం లాగు పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ..రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మొదటి బహుమతి రూ.35 వేలు, 2వ బహుమతి రూ.30 వేలు, 3వ బహుమతి రూ.20 వేలు, అందజేస్తున్నట్లు తెలిపారు.
KKD: కాకినాడ నుంచి మైసూర్ వెళ్లే స్పెషల్ ట్రైన్‌ను బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ రైల్వే శాఖ అనుమతించిందని సామర్లకోట స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ట్రైన్ నెం.17289/17290 కాకినాడ నుంచి సోమ, శుక్రవారాల్లో.. మైసూర్ నుంచి గురు, శనివారాల్లో నడుస్తుందని వివరించారు. ప్రయాణికులు ఈ మెరుగైన రైలు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
TPT: భారత ఉపరాష్ట్రపతి C. P.రాధాకృష్ణన్ తిరుపతి-తిరుమల పర్యటన నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్ ASL సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుచానూరు, తిరుమల వరకు భద్రతా ఏర్పాట్లు పరిశీలించి కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
అల్లూరి: అరకులోయలోని అల్లూరి సీతారామరాజు సీబీఎస్ఈ పబ్లిక్ స్కూల్ 44వ వార్షికోత్సవంను శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆర్టీసీ ప్రాంతీయ జోన్ ఛైర్మెన్ డా దొన్నుదొర, స్కూల్ ఛైర్మన్ సత్యన్నారాయణ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యలో ప్రతిభ చూపిన విద్యార్ధులకు మెడల్స్, ధృవపత్రాలు అందించారు.
CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117 నుంచి రూ.126, స్కిన్ రూ.170 నుంచి 205 వరకు పలుకుతోంది. స్కిన్‌లెస్ రూ.193 నుంచి రూ.230 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 78 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని దుకాణదారులు తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో చికెన్ కేజీ రూ.220, స్కిన్ లెస్ రూ.240గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900 స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ.450, రాగండి రూ.200, బొచ్చెలు రూ.230గా ఉన్నాయి. ఆదివారం సందర్భంగా చికెన్ ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు.
E.G: పెట్రోల్, డీజిల్ కొరత వార్తలపై రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి శనివారం కలెక్టర్ కీర్తి చేకూరితో ఫోన్‌లో సమీక్షించారు. కొన్ని ఏజెన్సీలు, సరఫరాదారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన నిఘా ఉంచి, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఇంధన సరఫరా సజావుగా సాగేలా చూడాలన్నారు.