W.G: కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. డిప్యూటీ సీఎం పేరిట నకిలీ సిఫార్సు లేఖలు సృష్టిస్తూ, దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో దళారులు చేసే మోసపూరిత వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని కలెక్టర్ హెచ్చరించారు.
W.G: భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన రథశాలకు MLA పులపర్తి రామాంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రతి ఏటా శివరాత్రికి జరిగే రథోత్సవానికి చిహ్నమైన రథానికి ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, మెంటే పార్ధసారధి, ఆలయ EO, కూటమి నాయకులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. మూడు నెలలకు మొత్తం రూ. 4,25,258 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్. లక్ష్మీబాయి, ఛైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొర, ధర్మకర్తల మండలి సభ్యులు, బ్యాంక్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
PLD: నరసరావుపేట శ్రీనివాస్ నగర్ వృద్ధాశ్రమంలో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు వృద్ధులను సందర్శించి అందించారు. వారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
VZM: జిల్లాకు ఐదు పశు ఔషది కేంద్రాలు మంజూరైనట్లు కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరాలలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా పశువులకు కావలసిన జనరిక్ మందులు తక్కువ ధరలకు రైతులకు అందించడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని పాడి రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
శ్రీకాకుళం నగర ప్రజలు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్. కూర్మారావు అన్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీయగణన ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతోందన్నారు. అలాగే, ప్రతీ ఇంటి నుండి జనగణన ఉండాలన్నారు.
NLR: రైతులు ఎకరాకు యూరియా 3 కట్టలు మాత్రమే వాడాలని MAO లక్ష్మి రైతులకు సూచించారు. సోమవారం విడవలూరు (m) ముదివర్తిలో అధిక మోతాదులో యూరియా వాడకం కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో ఒక ఎకరాకి 3 కట్టలు యూరియా కార్డుల ద్వారా మాత్రమే అందిస్తామన్నారు. రైతులు సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి పొందాలని తెలిపారు.
PLD: మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.5 కోట్లతో సిద్ధం చేసిన ప్రణాళికలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనంద రెడ్డి పరిశీలించారు. ఆలయ నమూనాల పునర్నిర్మాణంపై అధికారులతో సమావేశమై చర్చించారు. దేవస్థానం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
CTR: జిల్లా అటవీ శాఖ అధికారి డా. సుబ్బరాజుని జనసేన నాయకులు యువరాజు స్వేరో, తేజో బూసినాయని ఈరోజు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల పరిరక్షణ, అభివృద్ధి అంశాలపై వారు చర్చించగా, డీఎఫ్‌వో సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.
NDL: కొలిమిగుండ్లలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 29 నుంచి మే 9 వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇవాళ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ మండల అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.
KRNL: గోనెగండ్ల మండలం పుట్టపాశం సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ లారీని ఢీకొనడంతో ఎస్.లింగందిన్నె గ్రామానికి చెందిన గోపాల్ (50) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
E.G: కొవ్వూరు ఫైర్ స్టేషన్ వద్ద సోమవారం నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల్లో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షించే నిజమైన వీరులని పేర్కొన్నాను. ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెరగడం చాలా అవసరం అని అన్నారు.
ATP: గుత్తి నుంచి గుంతకల్‌కు వెళ్లే రహదారికి బైపాస్ వరకు రూ. 30 కోట్ల నిధులతో నూతన తారు రోడ్డు నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన మాటతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు.
PPM: బేబీ కిట్లు మంజూరు కోసం అధికారులకు నివేదికలు సమర్పించామని, త్వరలోనే కిట్లు అందిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా: ఎస్.భాస్కర రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఓ పత్రికలో వచ్చిన వార్తకు ఆయన స్పందించారు. మన్యం జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు బేబీ కిట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
PPM: జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థిని ప్రణీత జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా పేరును జాతీయ స్థాయిలో మారుమ్రోగేలా చేసిందని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి అన్నారు. పదోతరగతి చదువుతున్న ఈ క్రీడాకారిణి అండర్ 17 విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్స్ చేరుకోవడం అద్భుత విశేషం అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు.