• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

BPT: కొరిసపాడు మండలంలోని మేదరమెట్టలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సదరు వ్యక్తిని వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. తీవ్ర రక్తస్రావమై, క్షతగాత్రుడు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 11, 2026 / 05:40 PM IST

గాజువాకలో ‘సూర్య ఘర్’ పథకం ప్రారంభం

VSP: గాజువాక 75వ వార్డ్ చిన కోరాడ SC కాలనీలో ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ SC/ST యోజన’ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, అందరూ వినియోగించుకోవాలని సూచించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుందని తెలిపారు. పెద గంట్యాడ మండలంలో సుమారు 350 మంది అర్హులుగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

April 11, 2026 / 05:31 PM IST

ఆస్పరి మండలంలో తాగునీటి సమస్యపై ఆవేదన

KRNL: ఆస్పరి మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఇవాళ MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వారాలకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి రిజర్వాయర్ నిర్మాణం లేదా హంద్రీ నీవా కాల్వ నీటిని తరలించాలని డిమాండ్ చేశారు.

April 11, 2026 / 05:30 PM IST

వ్యవసాయ నష్టంతో రైతు ఆత్మహత్య

KDP: ఓబులవారిపల్లి మండలం పెద్ద ఓరంపాడు పంచాయతీ బెస్తపల్లి గ్రామంలో వ్యవసాయ నష్టంతో సారా సురేష్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంటలు విఫలమవడంతో అప్పుల భారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అతను పొలంలో పురుగుల మందు సేవించాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

April 11, 2026 / 05:30 PM IST

‘కాఫీ కబుర్లు’లో క్లస్టర్ ఇంఛార్జ్‌లతో సీఎం భేటీ

GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేశారు. క్లస్టర్ ఇంఛార్జ్‌లతో భేటీ అయిన సీఎం, రాజకీయాలు, పరిపాలనలో గత అనుభవాలు, ప్రస్తుత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై కార్యకర్తలకు విస్తృతంగా వివరించారు.

April 11, 2026 / 05:13 PM IST

తొలి వార్షికోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

BPT: ఏప్రిల్ నెల 19వ తేదీన బాపట్లలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తొలి ఆవిర్భావ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుని అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించారు.

April 11, 2026 / 05:12 PM IST

మదనపల్లెలో గంజాయి ముఠా అరెస్ట్

అన్నమయ్య: మదనపల్లె వద్ద గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పాత కేసులో పరారీలో ఉన్న నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1లక్ష విలువైన 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం చేపట్టింది.

April 11, 2026 / 05:06 PM IST

రెండో శనివారం..భక్తుల రద్దీ

CTR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో శనివారం భక్తులు పోటెత్తారు. రెండో శనివారం సెలవు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వరసిద్ధుడి దర్శనార్థం కాణిపాకం విచ్చేశారు. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి.. భక్తులు ఆలయం వెలుపలకు వచ్చారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఈఓ పెంచల కిషోర్, ఛైర్మన్ మణి నాయుడు పర్యవేక్షించారు.

April 11, 2026 / 05:06 PM IST

‘జలవనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’

E.G: బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయంలో MPDO శ్రీనివాస్ అధ్యక్షతన జలధార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బిక్కవోలు MPP సుమ పాల్గొని, మాట్లాడారు. జలవనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చెరువులు, నీటి వనరులను పరిరక్షించాలని ఎన్డీఏ కన్వీనర్ శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల త్రిమూర్తులు, చిట్టిబాబు చౌదరి పాల్గొన్నారు.

April 11, 2026 / 05:00 PM IST

ముద్దనూరులో ఇంటి తాళం పగలగొట్టి చోరీ

KDP: ముద్దనూరు టౌన్‌లో ఇంటి తాళం పగలగొట్టి నగదు, బంగారం దొంగతనం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. హేబ్రోన్ చర్చి వీధికి చెందిన నాగలచ్చమ్మ తన తల్లి చికిత్స కోసం బయటకు వెళ్లగా, ఈ ఘటన జరిగింది. సుమారు రూ.20 వేల నగదు, 3 గ్రాముల బంగారం అపహరించబడినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

April 11, 2026 / 05:00 PM IST

‘రాయల చెరువు సమస్యలను పరిష్కరించాలి’

KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామంలోని రాయల చెరువు సమస్యలను పరిష్కరించాలని నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత అవగాహన కార్యక్రమంలో జేఈ సంజీవ్ కుమార్‌ను టీడీపీ సీనియర్ నేత వీరేష్ గౌడ్, సాగునీటి సంఘం అధ్యక్షులు నారాయణ శనివారం డిమాండ్ చేశారు. చెరువు గట్టుపై ముళ్ల కంపలు పెరిగి పోయాయని, దీంతో గట్టు బలహీనపడే ప్రమాదం ఉందని జేఈ దృష్టికి తీసుకెళ్లారు.

April 11, 2026 / 05:00 PM IST

గేమింగ్ జోన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల

NDL: డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో మైకేల్ స్విమ్మింగ్ పూల్, గేమింగ్ జోన్‌ను శనివారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

April 11, 2026 / 05:00 PM IST

ఇరాన్ మహిళలకు రూ.1.50 లక్షల సాయం

NLR: యుద్ధం కారణంగా వైజాగ్‌లో చిక్కుకుని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరు ఇరాన్ మహిళలకు ఏపీ వర్ఫ్ బోర్డు రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం అందించింది. బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి ధైర్యం చెప్పి, నిధులను అందజేశారు. కష్టకాలంలో ఉన్న విదేశీయులకు కూటమి అండగా ఉంటుందని.. సీఎం చంద్రబాబు సహకారంతోనే నిధులు అందించామన్నారు.

April 11, 2026 / 04:50 PM IST

శ్రీకాకుళంలో అఖిలభారత కిసాన్ కాంగ్రెస్ దినోత్సవం

శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో అఖిలభారత 90వ కిసాన్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ.. రైతు కార్పొరేటు వ్యవస్థ ప్రస్తుత ప్రభుత్వాల చేతుల మధ్య నలిగిపోతూ వ్యవసాయాన్ని చేస్తున్న రైతులను ఆత్మహత్యల స్థితికి తీసుకెళ్తున్నారన్నారు.

April 11, 2026 / 04:46 PM IST

ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు

KRNL: పెద్దకడబూరు మండలం హనుమాపురం సమీపంలో 167 జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. SML డిగ్రీ కళాశాల ముందు, హనుమాపురం గ్రామ సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమలో ఏఎస్ఐ శివరాములు, టీడీపీ నేత బీపీ ఈరన్న పాల్గొన్నారు.

April 11, 2026 / 04:45 PM IST