• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ముఠా కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలి’

ప్రకాశం: ముఠా కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాయల మాలకొండయ్య డిమాండ్ చేశారు. సోమవారం వెలిగండ్లలో ముఠా కార్మికులతో సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ నెల 17,18,19 తేదీలలో నంద్యాలలో జరగనున్న రాష్ట్ర సీఐటీయూ 17వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

April 13, 2026 / 03:13 PM IST

జడ్పీ హైస్కూల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు

AKP: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు నడవాలని ఎస్ రాయవరం మండలం కొరుప్రోలు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం కే ప్రసాద్ సూచించారు. సోమవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి చేశారన్నారు.

April 13, 2026 / 03:10 PM IST

కేంద్ర గ్రంథాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

VSP: సూర్యబాగ్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వారోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రంధాలయ ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ సేవలను కొనియాడారు. సమానత్వం, మౌలిక హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. విద్యతో ముందుకు వెళ్లాలని పాఠకులకు పిలుపునిచ్చారు.

April 13, 2026 / 03:10 PM IST

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

NDL: ఆత్మకూరు మండలం సిద్ధపల్లెలో సోమవారం వడదెబ్బ తగిలి నాగిరెడ్డి (85) అనే ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. ఉపాధి పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తోటి కూలీలు అధికారులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వృద్ధాప్యంలోనూ పనికి వచ్చిన నాగిరెడ్డి మరణం గ్రామంలో విషాదం నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 13, 2026 / 03:10 PM IST

లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళం: కేంద్ర మంత్రి

SKLM: కనెక్టివిటిని పెంచడం ద్వారా లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళంను మార్చుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం పరిధిలోని పెద్దపాడు దగ్గర చెన్నై – కలకత్తా నగరాలను కలిపే కీలకమైన జాతీయ రహదారిలో కల్వర్ట్ నిర్మాణానికి ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ. 4 కోట్ల 64 లక్షల నిధులతో ఈ కల్వర్టు నిర్మిస్తున్నామన్నారు.

April 13, 2026 / 03:06 PM IST

ఎర్రగుంట్లలో కార్డాన్ సెర్చ్ నిర్వహణ

కడప జిల్లాలో ఎర్రగుంట్ల పరిధిలోని జువారి లేబర్ కాలనీలో పోలీసులు “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో రికార్డులు లేని 16 ద్విచక్ర వాహనాలు, 8 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు.

April 13, 2026 / 03:06 PM IST

హోలగుందలో నీటి సమస్య.. గ్రామస్థుల ఆందోళన

KRNL: హోళగుంద మండలం 8వ వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. 20 రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు సోమవారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంపీడీవో విజయలలితను కలిసి తమ సమస్యలు వివరించారు. వస్తున్న నీరు కూడా మురికిగా ఉండటంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్వచ్ఛమైన నీరు అందించాలని డిమాండ్ చేశారు.

April 13, 2026 / 03:02 PM IST

మృత ఏఎస్సై కుటుంబానికి చెక్కు అందజేత

CTR: విధుల్లో ఉండగా మరణించిన ట్రాఫిక్ ఏఎస్సై మొహమ్మద్ రఫీ కుటుంబానికి ఐడీఆర్‌ఎఫ్ ఫండ్ నుంచి రూ.1 లక్ష చెక్కును ఎస్పీ తుషార్ డూడి అందజేశారు. జిల్లా సాయుధ దళం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మృతుడి సతీమణి షకీరకు చెక్కు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తూ,  పోలీస్ శాఖ తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

April 13, 2026 / 03:00 PM IST

ఘనంగా పాడేరు మోదకొండమ్మ పండగ రాట ప్రతిష్ఠ

ASR: పాడేరు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ పండగ రాట ప్రతిష్ఠోత్సవం శతకం పట్టు వద్ద సోమవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఈ రాటను ప్రతిష్ఠించారు. మే 10, 11, 12 తేదీల్లో జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

April 13, 2026 / 03:00 PM IST

పోలేపల్లి గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి ఉషశ్రీ

సత్యసాయి: సోమందేపల్లి మండలం పోలేపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరించారు. నాడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఏ లోటు లేకుండా ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి, గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందన్నారు.

April 13, 2026 / 03:00 PM IST

దేవరపల్లిలో నవధాన్యాల కిట్లు పంపిణీ

E.G: దేవరపల్లి మండలంలో సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించే దిశగా పచ్చి రొట్ట & నవధాన్యాల కిట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహింకారు. ఎర్నగూడెం శ్రీ వేణుగోపాల ప్రాధమిక పరపతి సంఘం ఆధ్వర్యంలో మొత్తం 500 నవధాన్యాల కిట్లు తయారు చేసి రైతులకు అందజేశారు. పచ్చి రొట్ట విధానం రైతులకు అనేక విధాలుగా ఉపయోగకరమని వారు తెలిపారు.

April 13, 2026 / 03:00 PM IST

అధికారులపై కందుకూరు MLA ఆగ్రహం

NLR: గుడ్లూరు MPDO కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం జరిగింది. కందుకూరు MLA ఇంటూరి నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గత మూడు నెలల అర్జీల వివరాలను పరిశీలించి పరిష్కారంపై అధికారులను ప్రశ్నించారు.

April 13, 2026 / 03:00 PM IST

రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు గుంతకల్లు విద్యార్థిని

ATP: గుంతకల్లుకు చెందిన 9 ఏళ్ల బాలిక రుత్విక రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలకు ఎంపికయింది. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-9 చెస్ క్రీడా పోటీలలో విజేతగా నిలిచి సత్తా చాటినట్లు కోచ్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 18న తూర్పు గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు వెళ్లనున్నట్లు తెలిపారు.

April 13, 2026 / 03:00 PM IST

కలెక్టరేట్‌లో PGRS

PLD: కలెక్టరేట్‌లోని PGRS హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను ఆమె స్వయంగా విని, వారి నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

April 13, 2026 / 02:54 PM IST

కడప తాలూకా కొత్త సీఐగా నరసింహరాజు

కడప జిల్లాలో పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. పరిపాలనా సౌలభ్యం కోసం కడప తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ రెడ్డప్పను వీఆర్‌కు అటాచ్ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో ఒంటిమిట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నరసింహరాజును కడప తాలూకా నూతన సీఐగా నియమించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నరసింహరాజు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

April 13, 2026 / 02:54 PM IST