PPM: ఉపాధ్యాయుల, ఉద్యోగుల ఆర్థిక ఆర్థికేతర సమస్యల సాధనకై విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేస్తున్న నిరాహార దీక్షను ఇవాళ విజయవంతం చేయలంటూ ఫ్యాప్టో నేతలు కోరారు. దీనికి సంబంధించి ఈ నెల 25, 26 తేదీలలో నిరాహార దీక్షలు విజయవంతం అయ్యాయని మన్యం జిల్లా ఫ్యాప్టో నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొంటారని తెలిపారు.
AKP: ఎస్ రాయవరంలో కొత్తగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆదివారం ప్రారంభించారు. అలాగే అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రమణ్య స్వామి, తదితర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, శబరిమలై ఆలయ పూజారి రిజ్ కుమార్ పాల్గొని అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.
NDL: సంజామల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమాన్ని మండల పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం తహసీల్దార్ చంద్రశేఖర్ సూచించారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు అందరూ హాజరు కావాలన్నారు. PGRSలో వచ్చే ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని తహసీల్దార్ ఆదేశించారు.
VZM: భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపదల్లో యోగా ఒకటి అని MP కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం రణస్థలం మండల పరిషత్ కార్యాలయంలో యోగ గురూజీ శ్రీ విశ్వప్రేమ్ సుహాస్ ఆధ్వర్యంలో 272 వ సహజీవన యోగ బ్యాచ్ ముగింపు వేడుకలలో ఆయన పాల్గొన్నారు. యోగ అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని అది శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతౌల్యం సాధించే ఒక జీవన విధానమని తెలిపారు.
KRNL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉందని ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు ఆరోపించారు. పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. కొరత వల్ల రవాణా నిలిచిపోతూ, నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. కృత్రిమ కొరత సృష్టించే బంకులపై చర్యలు తీసుకోవాలన్నారు.
SKLM: జిల్లాలో ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు DSP వివేకానంద తెలిపారు. ఇవాళ ఉ. 9 నుంచి మ. 2 గంటల వరకు అరసవల్లి, శ్రీకూర్మం వెళ్లే వాహనాలను పెద్దపాడు మీదుగా గార రోడ్డుకు, గార నుంచి వచ్చే వాహనాలు పెద్దపాడు మీదుగా శ్రీకాకుళంలోకి ప్రవేశించాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
E G: ట్రేడింగ్ పేరిట ఓ మహిళ నుంచి రూ. 53 లక్షలకు మోసం చేసిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు రాజమండ్రి 3 పట్టణ సీఐ అప్పారావు తెలిపారు. ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ ఆన్లైన్ వెబ్సైట్లో రూ. 100 పెట్టుబడి పెట్టగా రూ. 300 లాభం వచ్చింది. దీంతో ఆమె తన భూమిని అమ్మి రూ. 53 లక్షలకు పెట్టగా లాభం వచ్చినట్లు వెబ్సైట్లో చూపినా తన ఖాతాలో జమ కాకపోవడంతో ఫిర్యాదు […]
ATP: జిల్లా వ్యాప్తంగా ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలను సోమవారం బంద్ చేస్తున్నట్లు డీలర్ల సంఘం నేతలు ప్రకటించారు. మహారాష్ట్ర డీలర్ల సమ్మెకు మద్దతుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో అవసరం లేని ఉత్పత్తులను డీలర్లు కొనాలని తయారీ కంపెనీలు బలవంతం చేయడం సరికాదని వారు డిమాండ్ చేశారు.
KDP: YVU అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నేడు యోగివేమన విశ్వవిద్యాలయంలో బంద్ నిర్వహిస్తున్నట్లు RSF రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు తెలిపారు. స్థానిక YVU ప్రధాన గేటు ప్రధాన ద్వారం వద్ద ఆదివారం నిరసనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ATP: తాడిపత్రిలోని పెట్రోల్ బంకులను రెవెన్యూ అధికారులు ఆదివారం తనిఖీ చేశారు. సివిల్ డిప్యూటీ తహసీల్దార్ మల్లేష్ ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంధన నిల్వలను పర్యవేక్షించారు. రవాణా కారణాల వల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా ‘నో స్టాక్’ బోర్డులు ఉన్నాయని, త్వరలోనే సరఫరా పునరుద్ధరణ అవుతుందని తెలిపారు. ఇంధన కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
NLR: ఏప్రిల్ 27 సోమవారం నుంచి మే 3 వరకు జరిగే పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, పలువురు సిబ్బంది సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
TPT: తిరుమలలో ఇంధన కొరత లేదని టీటీడీ స్పష్టం చేసింది. హెచ్‌పీ, ఐవోసీఎల్ బంకుల్లో తాత్కాలికంగా పెట్రోల్ అయిపోయినా, హెచ్‌పీ బంక్‌కు ఇప్పటికే ట్యాంకర్ చేరి సరఫరా ప్రారంభమైంది. ఐవోసీఎల్ బంక్‌కు రేపటికి ట్యాంకర్ చేరనుంది. భవిష్యత్తులో ఇంధన కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి సూచించారు.
NDL: డోన్ పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ బజార్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోనో స్కాన్స్ సెంటర్ ను ఆదివారం టీడీపీ యువ నేత కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వైద్య సేవలు ప్రజలకు చేరువ కావడం అవసరమన్నారు. స్కానింగ్ కేంద్రాలు ప్రజలకు మెరుగైన నిర్ధారణ సేవలు అందించడంలో కీలకమని పేర్కొన్నారు.
కోనసీమ: జిల్లాలో డీజిల్ కొరత అంశంపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సోమవారం ఉదయానికి జిల్లాకు అవసరమైన ఆయిల్ సరఫరా అవుతుందని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియాదేవి తెలిపారు. అమలాపురంలో ఉన్న జిల్లా కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. రెండు రోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వస్తాయని, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
ATP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సంబంధిత అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఇంధన సరఫరాలో ఇబ్బందులు లేదా అధిక ధరలపై వినియోగదారులు 8500292992, 08554-220009 నంబర్లకు సంప్రదించవచ్చు. అలాగే 1800-425-8804, 1800-425-8803 టోల్ ఫ్రీ నంబర్ల నుంచి కూడా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు.