VZM: జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జేసీ సేధు మాధవన్‌తో ఫోన్లో మాట్లాడారు. డీజిల్ ధరలు పెరుగుతాయన్న అపోహలు వద్దని… ప్రస్తుతానికి జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా...
E.G: నిడదవోలు పట్టణంలో మెప్మా ఆర్పీలుగా పని చేస్తున్న ఉద్యోగులకు జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్పీల సంఘం ఆధ్వర్యంలో (సీఐటియూ) సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ.. పట్టణంలో మెప్మా ఆర్పీలకు పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుజాత మాట్లాడుతూ… అభ్యుదయ వాది, వితరణ శీలి, సమర్థ పాలకుడు వెంకటాద్రి నాయుడు అని కొనియాడారు.
ATP: జిల్లాలో పరిశ్రమల స్థాపన, నిర్వహణ అనుమతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సరళీకరించినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఆన్లైన్ సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా అనుమతులు జారీ చేస్తామన్నారు. పరిశ్రమల తీవ్రతను బట్టి కేటగిరీలుగా విభజించి వేగంగా క్లియరెన్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని ఎనుములపల్లి గణేష్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ సత్య ఫ్యూయల్ పార్క్ పెట్రోల్ బంకును కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పెట్రోల్, డీజిల్ నిల్వల రికార్డులను పరిశీలించి సరఫరా తీరుపై ఆరా తీశారు. సీసీ కెమెరాలను తనిఖీ చేసిన ఆయన, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇంధన నిల్వలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
SKLM: పోలాకి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలను ‘యూడైస్ ప్లస్’ పోర్టల్‌లో విధిగా నమోదు చేయాలని మండల ఎంఈవో-2 శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం ఎంఆర్సీ కార్యాలయంలో సీఆర్ఎంటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రాథమిక పాఠశాలల్లో1 52 మంది చేరారని ఆయన పేర్కొన్నారు.
AKP: అచ్యుతాపురం పోలీస్ సహకారంతో బ్రాండిక్స్ అప్పారెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్-1లో మహిళల భద్రతపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు సీఐ చంద్రశేఖర్ రావు, ఎస్సై సుధాకర్, వన్ స్టాప్ సెంటర్ కోఆర్డినేటర్ మంజులవాణి, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ బృందం చట్టపరమైన హక్కులు, భద్రతా చర్యలు, స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు.
VSP: ఏయూ శతాబ్ది వేడుకల కోసం విశాఖ వచ్చిన నాగాలాండ్ ముఖ్యమంత్రి నేయిఫియు రియూ నగరంలోని పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘గ్లాస్ బ్రిడ్జ్’ పై ఆయన నడిచి, ఆ అనుభూతి అద్భుతంగా ఉందని, విశాఖ ప్రకృతి సౌందర్యం ఎంతో బాగుందని ప్రశంసించారు. విశాఖలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
PPM: జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
కడప ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అందిన 112 ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి, ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రకాశం: పొన్నలూరు మండలంలో చోరీలకు పాల్పడ్డ ఓ దొంగను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24న పరుచూరివారి పాలెం గ్రామంలోని ఓ ఇంట్లో దొంగ చోరీకి పాల్పడ్డాడు. గృహ సంబంధిత పరికరాలతో పాటు కారు బ్యాటరీలు చోరీ చేశాడు. దొంగని కోర్టులో ప్రవేశపడుతున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
PLD: ప్రజా సమస్యలను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జే.వీ. సంతోష్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 66 ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
CTR: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ శ్రీకాంత్ హామీ ఇచ్చారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. పలువురు ప్రజలు తమ సమస్యలపై ఆయనకు వినతి పత్రాలు అందించారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఆయన ఆదేశించారు.
TPT: రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి విమర్శించారు. ఈ నేపథ్యంలో తిరుపతి పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఎంపీ స్వయంగా తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారు. బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొనడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సత్యసాయి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి అర్జీపై సంబంధిత అధికారులతో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.