WG: జిల్లాలో భూ సమస్యల త్వరితగతిన పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రెవెన్యూ క్లినిక్‌లు’ సత్ఫలితాలు ఇస్తున్నాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అందిన 609 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 310 దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. మరో 299 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.
ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించారు. స్త్రీరక్ష పోర్టల్ ద్వారా సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లవచ్చని పోలీసులు వివరించారు. శక్తి యాప్ వినియోగం, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు యాప్ ఏ విధంగా రక్షణ ఇస్తుందో ప్రత్యక్షంగా చూపారు.
NDL: విశాఖలోని VMRDAలో ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని CM CBN, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సందర్శించారు. వచ్చే జూన్ 1 నుంచి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించేలా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం కోరగా కేంద్ర మంత్రి అంగీకరించారు. కర్నూలు- డోన్‌ను కొత్త జోన్లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
KDP: సిద్దవటం శివారులోని అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం రాత్రి SI హారిక వాహనాల తనిఖీ చేపట్టారు. బద్వేలు, కడప వైపు నుంచి వచ్చిన పలు రకాల వాహనాలను నిలిపి వాటి రికార్డులు పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఎస్సై సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరికలు చేశారు.
BPT: అద్దంకి మండలం సింగరకొండలో వెలసిన లక్ష్మీనరసింహ స్వామి జయంతి వేడుకలను ఈ నెల 30న వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెద్దినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. స్వామివారికి విశేషమైన సుగంధ పరిమళాలతో అభిషేకం నిర్వహించనున్నట్లు వివరించారు.
ప్రకాశం: పీసీపల్లి మండలం పిల్లివారిపల్లిలో అభయాంజనేయ స్వామి, కాశినాయన విగ్రహ ప్రతిష్టా మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కనిగిరి వైసీపీ ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా, కమిటీ సభ్యులు శేష వస్త్రాలతో అతిథులను సత్కరించారు.
NDL: దొంగతనం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నలుగురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తంబళ్లపల్లె కోర్టు తీర్పునిచ్చింది. నంద్యాల జిల్లాకు చెందిన అంకన్న, సత్య, చిన్నహుస్సేని, జంబులును పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్య గారిపల్లెలో అక్టోబర్ 2025న దొంగతనం నేరంలో అప్పటి ఎస్సై హరిహర ప్రసాద్ అరెస్టు చేశారు. తాజాగా వీరికి శిక్ష ఖరారైంది.
KRNL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రఘువీర్ ఓ ప్రకటన విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోందని తెలిపారు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు జిల్లాలోని 90 శాతం బంకుల్లో సాధారణ స్థితి కనిపించినట్లు పేర్కొన్నారు. ఇవాళ్టితో 100 శాతం ఇంధనం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.
ELR: చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళవారం రాత్రి బ్యాంకులను సందర్శించి వాహనదారులతో మాట్లాడారు. రోజు రోజుకు సరఫరా విషయంలో పరిస్థితులు మెరుగు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతినిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహిస్తూ ఎమ్మెల్యేలను కూడా అప్రమత్తం చేస్తున్నారన్నారు. రెవిన్యూ, పోలీస్ వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయన్నారు.
ELR: నరసాపురం మండలం శ్రీరామవరంలో 20 కుటుంబాలు టీడీపీ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ కుటుంబాలతో మల్లుకుంట సొసైటీ ఛైర్మన్ శీలం సాయి వినయ్ మంగళవారం రాత్రి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
KDP: పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’ అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. సుండుపల్లిలో ఇటీవల ప్రారంభించిన పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరు, హాజరుపై ఆరా తీశారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
KRNL: ఆదోని నుంచి పత్తికొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఆస్పరి సమీపంలో మంగళవారం సాయంత్రం ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉన్న బస్సుకు అకస్మాత్తుగా టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన ఆపడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాస్త ఆలస్యమైతే బస్సు బోల్తా పడేదని, డ్రైవర్ అప్రమత్తత వల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు.
NDL: జిల్లాలో రసాయన విపత్తుల సమయంలో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ నెల 30న ‘ఆఫ్-సైట్’ మాక్ డ్రిల్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అమరావతి నుంచి నిర్వహించిన VCలో డీఆర్వో రాము నాయక్ సహా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
PLD: కోసూరు గ్రామ శివారులో దారి తప్పి పొలాల్లో ఉన్న నూతిబావిలో పడిన చుక్కల జింకను ఎర్రబాలెం గ్రామ స్థానికులు గుర్తించారు. క్రోసూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని జింకను బావి నుంచి బయటకు తీశారు. పిడుగురాళ్ల ఫారెస్ట్ ఆఫీసర్ కే. నరసింహారెడ్డి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చుక్కల జింకను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు.
KRNL: రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం జిల్లాలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో ఇవాళ ముఖ్య కూడళ్లలో, చెక్‌పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.