• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఐరిష్ మస్తరు విధానాన్ని రద్దు చేయాలి’

W.G: ఉపాధి హామీ శ్రామికులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు తలనొప్పిగా మారిన ఐరిష్ మస్తర్ విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) చిన్నతాడేపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత విధానంలోనే మస్తర్ వేయాలని, అన్ని గ్రామాల్లోనూ పనులు కల్పించాలన్నారు.

April 28, 2026 / 05:30 PM IST

‘25% అదనంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పెరిగాయి’

ATP: జిల్లా పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంధన నిలువలు ఆశాజనకంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంధన సరఫరా పై కలెక్టర్, ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం 25% అదనంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.

April 28, 2026 / 05:24 PM IST

జమ్మలమడుగు టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం

KDP: జమ్మలమడుగు టోల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గండికోటకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న బాలుడితో సహా మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 28, 2026 / 05:20 PM IST

జిల్లా అభివృద్ధిలో ఇంజనీరింగ్ శాఖల పాత్ర కీలకం: కలెక్టర్

అన్నమయ్య: మదనపల్లిలో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన ఇంజనీరింగ్ శాఖల సమీక్షా సమావేశం జరిగింది. వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ, అనుమతుల సమస్యలను త్వరగా పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తే జిల్లా అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.

April 28, 2026 / 05:20 PM IST

అంగన్వాడీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

PPM: కురుపాం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 6, 2011 నాటి ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ. నం.39) ప్రకారం ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో ఖాళీగా ఉన్న 39 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను రోస్టర్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారి తెలిపారు.

April 28, 2026 / 05:13 PM IST

అంగన్వాడీపై ఆకస్మిక తనిఖీ

ASR: అరకులోయ మండలం నందివలస అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా అనే అంశంపై పరిశీలించారు. పిల్లలకు సరైన పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని సిబ్బందికి సూచించారు. ఎలాంటి లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 28, 2026 / 05:11 PM IST

‘కుష్ఠు వ్యాధిగ్రస్తులకు సకాలంలో చికిత్స అందించాలి’

NLR: నెల్లూరు జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులకు సమయానికి వైద్య సేవలు అందించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ షేక్ ఖాదర్ వలీ సూచించారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో కొత్త కేసులు, వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. అలాగే, వ్యాధిగ్రస్తులతో కలిసి నివసించే వారికి వ్యాధి వ్యాప్తి నివారించేందుకు “పెప్” మందు ఇవ్వాలని తెలిపారు.

April 28, 2026 / 05:06 PM IST

లైబ్రరీలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం

అన్నమయ్య: తంబళ్లపల్లె గ్రంథాలయంలో పిల్లలకు వేసవి శిక్షణా తరగతులను ప్రారంభించినట్టు లైబ్రేరియన్ జిలానీ బాషా తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలు TVలు, ఫోన్లకు బానిస కాకుండా ప్రభుత్వం, ఉన్నతధికారుల ఆదేశాలతో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నేటి నుంచి జూన్ 6 వరకు పిల్లలకు దినపత్రికలు, పుస్తకాలు చదివించడం, కథలు చెప్పడం, యోగా నేర్పించడం చేస్తామన్నారు.

April 28, 2026 / 05:06 PM IST

‘పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’

E.G: రానున్న పుష్కరాల దృష్ట్యా కొవ్వూరు పరిధిలోని భూములను MLA ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు PPP విధానంలో కాటేజీలు, గదులు, స్నానాల గదులు వంటి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు.

April 28, 2026 / 05:04 PM IST

పోలీస్ స్టేషన్‌ల్లో ఎస్పీ తనిఖీలు

ప్రకాశం: సంతమాగులూరు బల్లికురవ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుమంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌లో నిర్వహించే పలు రికార్డులను పరిశీలించారు. నమోదైన కేసులపై ఆరా తీశారు. ట్రాఫిక్ నివారణ రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను ప్రాపర్టీని అధికారుల అనుమతితో డిస్పోజల్ చేయాలని ఆదేశించారు.

April 28, 2026 / 05:03 PM IST

కంటి ఆపరేషన్ల వివరాలు పోర్టల్లో నమోదు చేయాలి

W.G: జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం డీఎంహెచ్ కార్యాలయంలో ప్రైవేట్ కంటి ఆసుపత్రుల ప్రతినిధులు, ఎన్జీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డా. గీతాబాయి మాట్లాడుతూ.. కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగుల వివరాలను తప్పనిసరిగా www.npcb.gov.in పోర్టల్ నమోదు చేయాలన్నారు. అంధత్వ నివారణకు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు.

April 28, 2026 / 05:02 PM IST

పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు: కమిషనర్

కర్నూలులో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించరాదని కమిషనర్ ఓబులేసు స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలు, కల్లూరు ప్రాంతాల్లో ఆయన పర్యటించి పనులను పరిశీలించారు. ప్రజలు సంతృప్తి చెందేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. చిన్న, మధ్య స్థాయి కాలువల్లో ప్రతి వారం పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

April 28, 2026 / 05:00 PM IST

జమ్మలమడుగులో ‘PGRS’ కార్యక్రమం

KDP: JMD టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని భూపేశ్ రెడ్డి మంగళవారం నిర్వహించారు. బాధితులు సమర్పించిన 10 వినతుల్లో అత్యధికంగా భూమికి సంబంధించిన సమస్యలే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల వల్ల భూ రికార్డుల్లో ఆన్‌లైన్ సమస్యలు తలెత్తాయని, తద్వారా సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధితులు ఆయనకు వివరించారు.

April 28, 2026 / 05:00 PM IST

‘PM-RAHAT’ పథకం పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో ‘PM-RAHAT’ పథకం పోస్టర్లను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు తొలి 24 గంటల్లో ఉచితంగా, నగదు రహిత అత్యవసర వైద్య సేవలు అందిస్తామన్నారు. ఒక్కొక్కరికీ గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు చికిత్స ఖర్చులు కవర్ అవుతాయన్నారు. ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 28, 2026 / 05:00 PM IST

సొంతూరిలోనే ఉపాధి కల్పించండి సారూ.!

NDL: గ్రామాల్లో పనులు లేకపోవడంతో పదుల కిలోమీటర్లు ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోందని కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లెలో మహిళా ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. మదనంతపురంలో మంగళవారం జాబ్ కార్డులు చూపిస్తూ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మదనంతపురం, రాఘవరాజుపల్లె, ఎస్.చెన్నంపల్లిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.

April 28, 2026 / 05:00 PM IST