• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కొడమంచిలిలో ప్రత్యేక అధికారికి ఫిర్యాదు..!

W.G: ఆచంట మండలం కొడమంచిలి పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన సోమేశ్వరరావును మంగళవారం కూటమి నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను ఆయనకు వివరించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని నాయకులు కోరారు. స్పందించిన అధికారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

April 7, 2026 / 03:41 PM IST

ఆలయ పనుల పురోగతిపై సమీక్షించిన ఎమ్మెల్యే

CTR: పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మంగళవారం అధికారులు, అర్చకులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గోపుర పనులు ఎంతవరకు వచ్చాయని ఈవో రమణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. శివాలయ గర్భగుడి పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలపై క్షుణ్ణంగా పరిశీలించారు.

April 7, 2026 / 03:38 PM IST

‘ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలి’

అన్నమయ్య: రాష్ట్రంలో పెరుగుతున్న బస్సు ప్రమాదాలపై హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర సమీక్ష జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రమాదాల కారణాలు, రోడ్డు భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు.

April 7, 2026 / 03:37 PM IST

రేషన్ దుకాణాలు పరిశీలించిన తాహసీల్దార్

ELR: లింగపాలెం మండల MRO నజిముల్లషా మంగళవారం ఒకటవ నెంబర్ రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ రేషన్ షాపులో ఇచ్చే బియ్యాన్ని గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయన్నారు. కార్డుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని డీలర్లకు వివరించారు. అనంతరం స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి పలు సూచనలు చేశారు.

April 7, 2026 / 03:34 PM IST

గంగమ్మ జాతరల ఏర్పాట్లపై కలెక్టర్‌తో సమావేశం

TPT: గంగమ్మ జాతరల నెల ప్రారంభం కానుండటంతో తిరుపతి తాతయ్య గంగమ్మ ఆలయ బోర్డు ఛైర్మన్, అర్చకులు, అధికారులు జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జాతరల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు. జాతరల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

April 7, 2026 / 03:31 PM IST

పశువుల మెడికల్ క్యాంపును వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట మండలం అర్వపల్లి గ్రామంలో మంగళవారం పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్‌లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాడి పశువుల గల రైతులు ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 7, 2026 / 03:30 PM IST

బస్సు ప్రమాదాల నివారణపై హోంమంత్రి-రవాణా మంత్రి సమీక్ష

GNTR: అమరావతి సచివాలయంలో రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలను నివారించేందుకే హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భవిష్యత్తులో పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

April 7, 2026 / 03:30 PM IST

ఉల్లి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం

KRNL: తుగ్గలి వ్యవసాయ కార్యాలయంలో ఉల్లి సాగుపై AO సురేష్ బాబు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తు వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పొలాల్లో నీరు నిల్వ ఉంటే ఉల్లిగడ్డలు కుళ్లే ప్రమాదం ఉందన్నారు. నీరు త్వరగా బయటకు వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉల్లితో పాటు అంతర్ పంటలు సాగు చేస్తే ఆదాయం పొందవచ్చని తెలియజేశారు.

April 7, 2026 / 03:30 PM IST

రైతులకు పాసు పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో రైతులకు కూటమి ప్రభుత్వం జారీ చేసిన189 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మంగళవారం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 21 నెలల్లో రైతుల ప్రగతి ద్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వంలో నేతలు రైతుల పాసుపుస్తకాలపై సొంత ఫోటోలను ముద్రించారని విమర్శించారు.

April 7, 2026 / 03:30 PM IST

సిరివెళ్లలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

NDL: సిరివెళ్ల PHC మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించినట్లు డాక్టర్ ముఖేష్ కుమార్ తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, మనిషికి ఎన్ని సిరి సంపదలు ఉన్నా వాటిని అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృథా అని పేర్కొన్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అంటువ్యాధులు దరి చేరవని స్పష్టం చేశారు.

April 7, 2026 / 03:23 PM IST

పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలి: ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

April 7, 2026 / 03:20 PM IST

కార్యకర్త భౌతిక కాయానికి ఎమ్మెల్యే నివాళులు

CTR: గుడిపాల మండలం దాయంవారి పల్లెలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త చల్లా గురుస్వామి నాయుడు ఇవాళ మృతి చెందాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జీజేఎం ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

April 7, 2026 / 03:17 PM IST

మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం

PPM: గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీవీర్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 7వ తరగతికి ఒక సీటు (బాలిక), 8, 9వ తరగతులకు ఒక్కో సీటు (బాలురు) ఎస్టీ విద్యార్థుల నుంచి కోరుతున్నామన్నారు. దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు స్వీకరిస్తున్నామన్నారు.

April 7, 2026 / 03:15 PM IST

గ్రంథాలయాల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయాల స్థితిగతులు, బకాయిల పరిష్కారం కోసం ఛైర్మన్ వన్నెం రెడ్డి సతీష్ కుమార్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను మంగళవారం కలిశారు. గ్రంథాలయాల అభివృద్ధికి అవసరమైన చర్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ భవనాల్లో ఉన్న గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు, డిజిటల్ సదుపాయాలు కల్పించాలని కోరారు.

April 7, 2026 / 03:13 PM IST

పశువైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏడి

NDL: బండి ఆత్మకూరు మండలంలోని ఏ.కోడూరు, పార్నపల్లె, బండి ఆత్మకూరు పశు వైద్యశాలలను వెలుగోడు సబ్ డివిజన్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్. వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. పశువైద్యశాలలో రిజిస్టర్లను, మందులను పరిశీలించారు. గాలికుంటు వ్యాధి టీకాల ప్రగతిని సమీక్షించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. వారితో పాటు మండల పశు వైద్యులు పాల్గొన్నారు.

April 7, 2026 / 03:13 PM IST