ELR: బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై గా నూతన బాధ్యతలు స్వీకరించిన పి. చెన్నారావు బుధవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెంపొందించే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు..
ELR: ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పేర్కొన్నారు. బుధవారం RWS SE త్రినాధ్, DE రామారావు, AE సుబ్రహ్మణ్యం మరియు RWS ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా త్రాగునీటి సరఫరాకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
KDP: చక్రాయపేట మండలం మహాదేవపల్లెకు చెందిన రైతు నరసింహులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మామిడికాయలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తన తోటలోని 172 మామిడి చెట్లను బుధవారం నరికివేశారు.17 ఏళ్లుగా సాగు చేసిన చెట్లకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
TPT: తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం సినీ నటి గీత దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆమెతో పలువురు ఫొటోలు దిగారు.
CTR: చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని ఆనగల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. పసుపు పోషణ ఆరోగ్య పరిరక్షణపై పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఝాన్సీ వెంకటేష్ యాదవ్, గురజాల చెన్నకేశవులు పాల్గొన్నారు.
SKLM: లావేరు (M) బుడుమూరులో అకాల వర్షాల కారణంగా 200 ఎకరాలు జొన్నపంట, 200 ఎకరాలు అరటితోటలు మిరప, నువ్వు, వరిసేను నేలమట్టమయ్యాయి. రైతు ప్రతి నిధి బృందం బుధవారం పర్యటించింది. మొక్కజొన్న ఎకరాకు రూ. 50 వేలు, అరటి ఉద్యానవన పంటలకు ఎకరాకు రూ. లక్ష నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా CPM కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు. అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేయాలన్నారు.
PPM: పాచిపెంట మండలం ఘాట్ రోడ్డులో లారీ బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో ట్రాఫిక్ క్లియర్ చెయ్యడంలో పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. సమాచారం అందుకున్న సాలూరు రూరల్ సీఐ రామక్రిష్ణ, పాచిపెంట ఎస్సై లాలం అర్జున్, సివిల్ పోలీసులు లారీలో ఉన్నా బియ్యం బస్తాలను మోసి స్వయంగా పక్కకు తరలించారు. ట్రాఫిక్ క్లియర్ చేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేశారు.
ATP: మంగళగిరిలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణా తరగతుల్లో జిల్లా సీనియర్ నేత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు పాల్గొన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన విధివిధానాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. క్లస్టర్ ఇంఛార్జ్‌లు ఎప్పటికప్పుడు గ్రామ, మండల కమిటీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ప్రకాశం: కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలనే డిమాండ్‌తో కనిగిరిలో AITUC జిల్లా మహాసభల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కులను సాధించేందుకు ప్రభుత్వాన్ని కోరారు. CITU జిల్లా నాయకులు యాసీన్ మాట్లాడుతూ.. కనీస వేతన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
AKP: మాజీ ఎమ్మెల్యే, పాయకరావుపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు, ఎస్ రాయవరం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అప్పన్నను పోలీసులు బుధవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనకు విశాఖ వెళుతున్న నేపాధ్యంలో వారిని పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
W.G: ఆచంట మండలం కరుగోరుమిల్లిలో మంగళవారం రాత్రి ఉంగరాల నాగలక్ష్మి ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలిపోయింది. పేలుడు ధాటికి గోడలు బీటలు వారి సామాన్లు చెల్లాచెదురయ్యాయని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
KRNL: ఓర్వకల్లు మండలం హుసేనాపురంలో నిన్న దాసరి మహేష్ (33) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలో పనుల కోసం తీసుకెళ్లిన ఇనుప నిచ్చెనను తిరిగి తీసుకువస్తుండగా, అది విద్యుత్ తీగలకు తగిలి వెంటనే కుప్పకూలిన మహేష్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
SS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి సవితను బుధవారం పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు కూడా ఆమెను కలిసి తమ సమస్యలను విన్నవించారు. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి, వాటిని సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ELR: చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం స్థానిక నేతలతో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాని కార్యకర్తలకు, నేతలకి సూచించారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏమైన సమస్యలు ఉంటే వాటిని నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ASR: ఒడిశాకు చెందిన రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి, మే ఫేర్ హోటల్స్ యజమాని దిలీప్ కుమార్ రేను జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో శాలువా కప్పి, బొకే అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కూటమి నేతలు జగన్ తదితరులు పాల్గొన్నారు.