• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రమాద భరితంగా RTC ప్రయాణం

PLD: మాచవరం మండలంలో RTC ప్రయాణం ప్రమాద భరితంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో వందల సంఖ్యలో మహిళలు బస్సుల్లో కిక్కిరిసిపోతున్నారు. కూర్చునేందుకు సీట్లు కూడా సరిగ్గా లేక ప్లాట్ ఫాంపై నిలబడి మరి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇలాగైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కవ ఉందని, అదనపు బస్సులు వెయ్యాలని ప్రయాణికులు కోరుతున్నారు.

April 16, 2026 / 02:46 PM IST

అంగన్వాడీ దరఖాస్తుదారులకు కీలక గమనిక

NDL: ఆత్మకూరు ప్రాజెక్టు పరిధిలోని 3 అంగన్వాడీ కేంద్రాలలో రోస్టర్ ప్రకారం ఆయా పోస్టులకు రిజర్వేషన్లు సవరణ చేసినట్లు ఇవాళ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు. మహానంది మండలం బసాపురం చలమ అంగన్వాడీ కేంద్రం ఎస్పీ-2, ఆత్మకూరు మండలం నల్లకాలువ గ్రామ అంగన్వాడీ కేంద్రం ఎస్టీ, బాపనంతపురం ఎస్సీ-3 వర్గాలకు రిజర్వేషన్లు మార్చామన్నారు.

April 16, 2026 / 02:44 PM IST

ఢిల్లీ పర్యటనలో ఎమ్మెల్యే మాధవి

GNTR: పొలిట్ బ్యూరో సభ్యులు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చలను నేడు, రేపు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ప్రధాని, స్పీకర్, కేంద్రమంత్రులను కలిసి మహిళా సాధికారతకు మద్దతుగా కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.

April 16, 2026 / 02:43 PM IST

జిల్లాలో కార్డెన్ సెర్చ్.. 94 వాహనాలు స్వాధీనం

BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చుండూరు, పర్చూరు, చీరాల వన్ టౌన్ స్టేషన్‌ల పరిధిలో గురువారం సంబంధిత పోలీస్ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాలను వారు జల్లెడ పట్టి, అనుమతి పత్రాలు లేని 90 బైకులు, మూడు ఆటోలు, ఒక కారును స్వాధీన పరుచుకున్నారు.

April 16, 2026 / 02:42 PM IST

తాడేపల్లిగూడెంలో ‘జనగణన’ కార్యక్రమం ప్రారంభం

W.G: తాడేపల్లిగూడెంలో జనగణన-2027 కార్యక్రమం క్షేత్రస్థాయి పనులు మున్సిపల్ కమిషనర్ ఎం.యేసుబాబు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు, జనగణన సిబ్బందితో కలిసి1వ వార్డులో ఇంటింటి సర్వే పనులను పరిశీలించారు. జనగణన దేశ అభివృద్ధికి, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆధారమని, ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.

April 16, 2026 / 02:40 PM IST

క్షతగాత్రులను పరామర్శించిన కమిషనర్

KRNL: మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎమ్మిగనూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను మునిసిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

April 16, 2026 / 02:40 PM IST

‘జిల్లా మ‌హిళ‌ల‌కు ఇప్ప‌టికే 44 % రిజ‌ర్వేష‌న్’

VZM: మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో 33% రిజ‌ర్వేష‌న్ బిల్లులు ఆమోదించేందుకు పార్ల‌మెంట్ సిద్ధ‌మ‌వుతోన్న నేప‌థ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మ‌హిళా సాధికారిత‌కు కూట‌మి ప్ర‌భుత్వం ఎప్పుడు కట్టుబ‌డి ఉంద‌న్నారు. ఇప్పటికే ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లాల...

April 16, 2026 / 02:38 PM IST

అడవి దున్న దాడిలో ఒకరి మృతి

ASR: మారేడుమిల్లి మండలం ఉత్తలూరు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి(42) గురువారం అడవి దున్న దాడిలో మృతి చెందాడని సీఐ ప్రసాద్ తెలిపారు. తన జఫ్రా తోటలో పని చేస్తుండగా అడవి దున్న దాడి చేయడంతో అతను స్పాట్‌లోనే మృతి చెందాడని పేర్కొన్నారు. దీంతో, మారేడుమిల్లి మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ హెచ్చరించారు.

April 16, 2026 / 02:37 PM IST

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ DMHO

KDP: మైదుకూరు సమీపంలోని కృష్ణాపురంలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ DMHO మల్లేశ్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్చి నెలలో జరిగిన అబార్షన్లపై ఆడిట్ నిర్వహించారు. అబార్షన్ల ప్రక్రియలు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 16, 2026 / 02:35 PM IST

నీటి సరఫరాపై ఇంటింటికీ వెళ్లి ఆరా తీసిన కమిషనర్

NLR: నగరంలోని 39వ డివిజన్ మూలపేట ప్రాంతంలో కమిషనర్ పర్యటించి తాగునీటి సరఫరాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్, ఎన్ఎంసీ ఎస్.ఈ రహ్మత్ జాని, ఈఈ రఘురామ్, ఇతర అధికారులతో కలిసి బ్రాహ్మణ వీధి, ఈ.ఎస్.ఆర్.ఎం వాటర్ ట్యాంక్ పరిసరాల్లో కమిషనర్ పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో నీటి సరఫరా స్థితిగతులపై ఆరా తీశారు.

April 16, 2026 / 02:30 PM IST

జనగణనను ప్రారంభించిన ఎమ్మార్వో

ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో గురువారం భారతదేశ జనాభా గణన – 2027లో భాగంగా స్వీయ గణన కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ స్లీవా జోజి ప్రారంభించారు. గ్రామంలోని ప్రజల చేత స్వీయ గణన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఈ సౌకర్యాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని, సులభంగా, త్వరగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు.

April 16, 2026 / 02:30 PM IST

హంద్రీనీవా కాలువలో ఈత నిషేధం: ఎస్సై

సత్యసాయి: హంద్రీనీవా కాలువలో ఈతకు వెళ్లి ఇటీవల ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో సోమందేపల్లి ఎస్సై సుధాకర్ యాదవ్ గురువారం హెచ్చరికలు జారీ చేశారు. ఎండాకాలంలో పిల్లలు, యువత కాలువలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో తల్లిదండ్రులు పర్యవేక్షణ పెంచాలని సూచించారు. కాలువల్లో ఈత పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 16, 2026 / 02:30 PM IST

రేపు ‘నారీ శక్తి వందన్ అధినియం’ కార్యక్రమం

KRNL: నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా రేపు ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఇవాళ ‘నారీ శక్తి వందన్ అధినియం’ కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ నియోజకవర్గ స్పెషల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 2,000 మంది మహిళలు పాల్గొనాలన్నారు.

April 16, 2026 / 02:25 PM IST

APSRTCలో తాత్కాలిక ఉద్యోగాలు.!

GNTR: తెనాలి APSRTC డిపోలో డ్రైవర్లకు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఎంపికైన వారికి 8 గంటలకు రూ.1000, 16 గంటలకు రూ.2000 వేతనం అందించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, అర్హత సర్టిఫికెట్‌లు తీసుకుని డిపో మేనేజర్ కార్యాలయాన్ని సంప్రదించాలని మేనేజర్ ఏ. రాజశేఖర్ తెలిపారు.

April 16, 2026 / 02:23 PM IST

జన గణన శిక్షణ తరగతులను ప్రారంభించిన కలెక్టర్

CTR: జన గణన -2027లో భాగంగా చిత్తూరు సంతపేట పీఎన్సీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మొదటి దశ ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల  శిక్షణ తరగతులను గురువారం కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. శిక్షణ తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించి ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లతో మాట్లాడారు. శిక్షణలో భాగంగా జనగణన సర్వేపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు.

April 16, 2026 / 02:20 PM IST